ప్రభాస్ ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలివే

బాహుబలి తర్వాత ప్రభాస్ కథల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్ కథలని ట్రై చేయడం లేదు.

Update: 2024-07-02 04:23 GMT

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక హీరోగా ఉన్నాడు. సరైన కథ పడితే అతని సినిమాలు వెయ్యి కోట్లు అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదని ప్రూవ్ చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ మూవీ చాలా సునాయాసంగా 4 రోజుల్లోనే 500 కోట్లు కలెక్షన్స్ దాటేసింది. తక్కువ టైంలో ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కథల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్ కథలని ట్రై చేయడం లేదు.

బాహుబలి తర్వాత చేసిన సాహో కంప్లీట్ గా స్టైలిష్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కింది. అయితే కథలో ఎమోషన్ వలన బ్రేక్ ఈవెన్ తో గట్టెక్కింది. తరువాత వచ్చిన రాధేశ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చింది. అయితే ఈ సినిమా ఎవరికి కనెక్ట్ కాలేదు. నెక్స్ట్ రామాయణం బేస్డ్ గా ఆదిపురుష్ చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే సలార్ తో మాస్ కథని మాఫియా బ్యాక్ డ్రాప్ లో ట్రై చేసి సక్సెస్ అందుకున్నాడు.

ఇప్పుడు కల్కి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో అతని మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్ సినిమాల విధానం చూసుకుంటే చేసిన కంటెంట్ మళ్ళీ చేయడం లేదు. కొత్తదనం ఉన్న కథలకి పెద్ద పీట వేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడం కూడా గగనం అయిపోతుంది. పుష్ప రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటిపోయింది.

Read more!

అయితే ప్రభాస్ మాత్రం సినిమాల విషయంలో పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. గత ఏడాది ఆదిపురుష్, సలార్ రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే కల్కి థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పైన ఉండగానే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. హను దర్శకత్వంలో మూవీ సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుందట. అలాగే సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ డిసెంబర్ లో పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉందంట.

అలాగే ప్రభాస్ తన సినిమాల కథ, కథనం విషయంలో డైరెక్టర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు. తనని ఎలా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది దర్శకులకి క్లారిటీ ఉంటుందని నమ్ముతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసిన కూడా ప్రభాస్ అదే పంథా అనుసరిస్తున్నాడు. ఇలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వలన దర్శకుల విజన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ మూడు అంశాలలో మిగిలిన స్టార్ హీరోలు అందరూ కచ్చితంగా ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News