'సలార్ 2'పై మైండ్ బ్లాక్ అయ్యే వార్త
సీక్వెల్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ, -''ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. వీలైనంత త్వరగా ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతో మేం అతి త్వరలో ప్రారంభించబోతున్నాము.
ప్రభాస్ నటించిన 'సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది. ఈ భారీ యాక్షన్ చిత్రం ఉత్తరాదినా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. షారుఖ్ ఖాన్ డంకీతో పోటీపడుతూ బాక్సాఫీస్‌ను శాసిస్తూనే ఉంది. ఈ చిత్రం క్రిస్మస్ 2023లో విడుదల కాగా డంకీని రేసులో వెనక్కి నెట్టింది. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ 2 గురించి ఓపెనయ్యారు. సలార్ పార్ట్ 2 ని 'శౌర్యాంగ పర్వం' పేరుతో తెరకెక్కించనున్నారు.
సీక్వెల్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ, -''ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. వీలైనంత త్వరగా ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతో మేం అతి త్వరలో ప్రారంభించబోతున్నాము. నా అభిమానులు చాలా మంది ఉత్కంఠతో ఉన్నారని నాకు తెలుసు. త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. త్వరలో సలార్ పార్ట్ 2 వివరాలను వెల్లడిస్తాము'' అని తెలిపారు. ''నేను చేసే పనితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యాగ్జిమమ్ ప్రజల్ని అలరించడమే నా ఏకైక లక్ష్యం. నేను ఎంచుకునే చిత్రాల వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన అదే. తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది. సలార్ ఒక కఠినమైన మాస్ చిత్రం. మారుతితో తదుపరి ప్రాజెక్ట్ ఒక హారర్ చిత్రం. ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన జోనర్‌లను అన్వేషించాలనుకుంటున్నాను. సలార్‌పై కురిపించినంత ప్రేమను నా భవిష్యత్ చిత్రాలపై కురిపిస్తారని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
ఇటీవల ప్రశాంత్ నీల్ సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం గురించి ఓపెనయ్యాడు. అతడు మాట్లాడుతూ సినిమా ముగింపుని చూపించేందుకు ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్‌లో తాను స్థాపించిన ప్రపంచం ఖన్సార్.. అందులోని పాత్రలు సినిమా సీక్వెల్‌లో కూడా తిరిగి కనిపిస్తాయని చెప్పాడు. వీటన్నిటి ఔచిత్యం దేవా - వరదల మధ్య స్నేహం శత్రుత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది. నేను సలార్ 2ని ఎలా పూర్తి చేయాలనుకుంటున్నాను? అంటే అది ఇంకా చెప్పను'' అని అన్నారు.
సలార్: పార్ట్ 1 లో శ్రుతి హాసన్, బాబీ సింహా, జగపతి బాబు, మైమ్ గోపి, జాన్ విజయ్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని హోంబలే ప్రొడక్షన్స్ నిర్మించింది. కల్పిత ఊహాజనిత ప్రపంచం స్టేట్ ఆఫ్ ఖాన్సార్ లో గొడవేంటనేది తెరపైనే చూడాలి. తెగలు జాతుల మధ్య గొడవల్ని మోడ్రనైజ్డ్ సాంకేతికతతో తెరపై చూపారు. 'సలార్: పార్ట్ 1'లో ఒక తెగ (శౌర్యంగ)కు చెందిన దేవా (ప్రభాస్), ఖాన్సార్ యువరాజు వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం నేపథ్యాన్ని చూపించారు. రెండో భాగంలో సింహాసనం కోసం స్నేహితుల కోట్లాటను ప్రశాంత్ నీల్ చూపించనున్నారు.
మారుతీ చిత్రం జానర్ ఇదే:
ప్రభాస్- మారుతీ కలయికలో సినిమా కథాంశం గురించి ప్రభాస్ ఇప్పటికే ఓపెనయ్యారు. మారుతీతో తన తదుపరి చిత్రం హారర్ చిత్రమని ప్రభాస్ వెల్లడించాడు. ఈ హర్రర్ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. సలార్ విడుదలైన తర్వాత ప్రభాస్ మారుతి సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, మిగతా ఇద్దరు కథానాయికలను త్వరలో ప్రకటిస్తారు. ఈ ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి 2898 ADలో కూడా షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఈ సంవత్సరం విడుదల కానుంది.