ప్రభాస్.. అందులో డబుల్ డోస్!

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2024-06-19 03:45 GMT

దర్శకుడు సందీప్ రెడ్డి ప్రభాస్ తో "స్పిరిట్" అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "యానిమల్" చిత్రంతో సంచలన విజయం సాధించిన సందీప్, తన తదుపరి ప్రాజెక్ట్ పట్ల భారీ అంచనాలు నెలకొల్పాడు. "స్పిరిట్" అనే టైటిల్ తో ఈ సినిమాకు కావాల్సిన హైప్ వచ్చేసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక టి-సిరీస్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ప్రభాస్ కెరీర్ లోనే ఫస్ట్ టైం పోలీస్ పాత్ర కావడం విశేషం. ఈ పాత్రను చాలా వైల్డ్ గా, పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. మొత్తంగా ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నాడట.

ప్రభాస్ ఫస్ట్ లుక్ పక్కా మాస్ లుక్‌గా ఉంటుందని, ఆ లుక్‌లో ప్రభాస్ ప్రేక్షకులకు నిజంగా షాక్ ఇస్తాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. రఫ్ అండ్ రగ్గుడ్ లుక్‌తో ప్రభాస్ సరికొత్త గెటప్‌లో పోలీస్ గా దర్శనమివ్వబోతున్నాడట. ఇది ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ప్రభాస్ సెకండ్ లుక్ విషయంలో, అతను సూపర్ స్టైలిష్ లుక్‌లో, హాలీవుడ్ హీరో స్థాయిలో కనిపించనున్నాడట.

ఈ లుక్ ప్రభాస్ అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది. ఈ లుక్స్‌ గురించి ఇంకా అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, సోషల్ మీడియాలో దీని గురించి ఫ్యాన్స్ గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. "స్పిరిట్" సినిమా స్క్రిప్ట్ వర్క్ 70 శాతం పూర్తయినట్లు సమాచారం. ఇక సినిమాకు 300 కోట్ల బడ్జెట్ ఖర్చయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సందీప్ రెడ్డి వంగా గతంలో చేసిన అన్ని చిత్రాల కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతోంది.

మరోవైపు సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ "కల్కి 2898 A.D." చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ పాన్ వరల్డ్ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే విదేశాల్లో ప్రభాస్ మార్కెట్ మరింత పెరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కల్కి తర్వాత ప్రభాస్ లైన్ అప్ లో మరుతి దర్శకత్వంలో "రాజాసాబ్", అలాగే "సలార్ 2" చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు "స్పిరిట్" చిత్రం కూడా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మరో సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉంది. మొత్తం మీద ప్రభాస్ నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు రావడం ఆనందకర విషయం.

Tags:    

Similar News