ప్ర‌భాస్ 'స్పిరిట్' ఆ లెవ‌ల్లో

ఈ చిత్రాన్ని యాక్షన్-ప్యాక్డ్ విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దాల‌ని సందీప్ భావిస్తున్నందున నిర్మాత‌లు దాదాపు 300 కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయిస్తున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

Update: 2024-06-10 05:49 GMT

వ‌రుస బ్లాక్‌ బ‌స్ట‌ర్ల‌తో దేశంలో టాప్ డైరెక్ట‌ర్ హోదాను అందుకున్నాడు సందీప్ వంగా. అర్జున్ రెడ్డి- క‌బీర్ సింగ్- యానిమ‌ల్ చిత్రాల‌తో అత‌డు హ్యాట్రిక్ విజయాల్ని న‌మోదు చేసిన‌ డెబ్యూ ద‌ర్శ‌కుడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అప‌ జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా ఎస్.ఎస్.రాజ‌మౌళికి గుర్తింపు ఉంది. ఆ త‌ర్వాత సందీప్ వంగా పేరు రికార్డుల‌కెక్కింది.

సందీప్ వంగా క్రేజ్ 'యానిమల్' త‌ర్వాత మ‌రింత‌గా పెరిగింది. ఇప్పుడు అత‌డు పాన్ ఇండియా డైరెక్ట‌ర్. రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్, సుకుమార్ త‌ర‌హాలోనే అసాధార‌ణ క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు. సందీప్ రెడ్డి వంగా తన పాన్-ఇండియా అప్పీల్‌ను క్రమంగా పెంచుకుంటున్నాడు. ప్రభాస్ తో 'స్పిరిట్' అలాంటి ప్ర‌య‌త్న‌మే. ప్ర‌స్తుతం ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను అభివృద్ధి చేస్తున్నాడు. ఇటీవ‌ల‌ డైలాగ్ వెర్షన్ ప్రోగ్రెస్‌లో ఉంద‌ని తెలుస్తోంది.

'స్పిరిట్' చిత్రీక‌ర‌ణ‌ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని స‌రికొత్త అవతార్‌లో క‌నిపిస్తాడు. అత‌డు నిజాయితీగల శక్తివంతమైన పోలీస్ అధికారిగా క‌నిపిస్తాడు. మునుపెన్న‌డూ ఇండియ‌న్ స్క్రీన్ పై క‌నిపించ‌ని నిజాయితీ ప‌రుడైన పోలీస్ గా ప్ర‌భాస్ ని సందీప్ వంగా ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ట‌. అత‌డి క్యారెక్ట‌ర్ డిజైన్ డెప్త్, ఎమోష‌న్ తో నిండి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యాక్షన్-ప్యాక్డ్ విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చిదిద్దాల‌ని సందీప్ భావిస్తున్నందున నిర్మాత‌లు దాదాపు 300 కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయిస్తున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. స్పిరిల్ నటీనటులు, సాంకేతిక నిపుణులు, విడుదల తేదీకి సంబంధించిన వివ‌రాల‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ తన సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ 'కల్కి 2898AD' విడుద‌ల ప్ర‌చారంలో ఉన్నాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించ‌గా.. దిశా పటానీ, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్నారు. భ‌విష్య‌త్ ప్ర‌పంచం ఎలా ఉండ‌బోతోందో నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో ఆవిష్క‌రించ‌నున్నారు. క‌ల్కి విడుద‌ల త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం స్కైని ట‌చ్ చేస్తుంది. ఆ త‌ర్వాత స్పిరిట్ తో అది మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News