భార్య‌తో విడిపోయినా పిల్ల‌లే ప్ర‌భుదేవా జీవితం!

ఈ జంట విడాకుల గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడకపోయినా, రామ్‌లత్ మొదటిసారిగా వారి విడాకుల గురించి తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.;

Update: 2025-04-14 00:30 GMT
భార్య‌తో విడిపోయినా పిల్ల‌లే ప్ర‌భుదేవా జీవితం!

భార్య, ఇద్ద‌రు ఎదిగిన పిల్ల‌లు ఉన్నా, ప్ర‌ముఖ క‌థానాయిక‌తో డీప్ ల‌వ్ లో మునిగిన ప్ర‌భుదేవా చివ‌రికి భార్య‌కు విడాకులివ్వ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ప్రభుదేవా త‌న‌ మాజీ భార్య రామ్‌లత్ 14 సంవత్సరాల క్రితం (2011లో) విడాకులు తీసుకున్నారు. ఈ జంట విడాకుల గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడకపోయినా, రామ్‌లత్ మొదటిసారిగా వారి విడాకుల గురించి తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

తమిళ యూట్యూబ్ ఛానల్ అవల్ వికటన్‌తో మాట్లాడుతూ.. రామ్‌లత్ త‌న‌ కుమారుడు రిషి రాఘవేంద్ర దేవా తొలి రంగస్థల ప్రదర్శన గురించి మాట్లాడారు. బాలుడు త‌న‌ తండ్రి ప్రభుదేవాతో వేదికను షేర్ చేసుకున్నాడు. దీనిని గర్వకారణమైన క్షణం అని రామ్ ల‌త్ పేర్కొన్నారు. ప్రభుదేవాను గొప్ప తండ్రి అని రామ్ ల‌త్ కీర్తించారు. అతడు వారి పిల్లలతో గొప్ప బంధాన్ని క‌లిగి ఉన్నాడు. పిల్లలు ఆయ‌న‌ జీవితం. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో గొప్ప అనుబంధం కలిగి ఉంటారు. తండ్రీకొడుకులు ముగ్గురూ పరిస్థితి ఎలా ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు! అని రామ్‌లత్ అన్నారు. ప్రభుదేవాను ప్రశంసిస్తూ కొరియోగ్రాఫర్ - ద‌ర్శ‌కనటుడు తన పిల్లల విషయంలో అంతే బాధ్యతగా ఉంటార‌ని .. వారిని తన ప్రాధాన్యతగా భావిస్తారని ప్ర‌భుదేవా మాజీ భార్య అన్నారు. పిల్లల విషయంలో ప్రతి నిర్ణయాన్ని పరస్పరం తీసుకుంటాము! అని రామ్‌ల‌త్ తెలిపారు.

మేం విడిపోయిన తర్వాత అతడు నా గురించి ఏదైనా చెడుగా మాట్లాడి ఉంటే నేను కోపంగా ఉండేదానిని.. కానీ అతడు ఎప్పుడూ అలా చెప్పలేదు. అలాంటి వ్యక్తి గురించి నేను చెడుగా ఏమీ అనను! అని అన్నారు.

అగ్ర క‌థానాయిక‌ నయనతారను ప్రేమించి సహజీవనం ప్రారంభించిన తర్వాత ప్ర‌భుదేవా వైవాహిక జీవితం దెబ్బతింది. నిజానికి ప్ర‌భుదేవాతో లైఫ్ లో సెటిల‌వ్వ‌డం కోసం న‌య‌న‌తార సినిమాలను కూడా వదులుకున్నారు. కానీ చివ‌రికి ఆ జంట విడిపోయారు. ఆ త‌ర్వాత న‌య‌న్.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది.

Tags:    

Similar News