సీనియర్ నటుడు ప్రభు కుమార్తె పెళ్లి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట ప్రేమ వివాహం ఇటీవల ట్రెండింగ్ లో నిలిచింది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట ప్రేమ వివాహం ఇటీవల ట్రెండింగ్ లో నిలిచింది. ఇంతలోనే ఇప్పుడు మరో సెలబ్రిటీ వెడ్డింగ్ చర్చగా మారుతోంది. మార్క్ ఆంటోని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రముఖ సీనియర్ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య త్వరలో పెళ్లి ప్రమాణం చేయబోతున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. అధిక్ రవిచంద్రన్ ఇటీవల 'మార్క్ ఆంటోని' విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. ఇందులో విశాల్- ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఆధిక్ - ఐశ్వర్య చాలా కాలంగా స్నేహితులుగా గొప్ప బంధాన్ని కలిగి ఉన్నారు. వారి స్నేహం ప్రేమగా మారిందని సమాచారం.
ఆదిక్ -ఐశ్వర్య ఇరు కుటుంబాలు వారి వివాహానికి ఆమోదం తెలిపాయి. ఈ డిసెంబర్లో పెళ్లి జరిగే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఐశ్వర్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది. అంతకుముందు 2008లో సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఆమె వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఐశ్వర్య మళ్లీ చెన్నైకి వచ్చారు. ఆమె సోదరుడు విక్రమ్ కోలీవుడ్ హీరో అన్న సంగతి తెలిసిందే. అతడు లక్ష్మి ఉజ్జయిని అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తళా అజిత్ కుమార్ కి వీరాభిమాని. అజిత్ కుమార్ 63 కి (డ్రీమ్ ప్రాజెక్ట్) దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రభు సౌత్ లో సీనియర్ నటుడిగా సుపరిచితుడు. అతడు చివరిగా తమిళ యాక్షన్ డ్రామా చిత్రం 'కాథర్ బాషా ఎంద్ర ముత్తురామలింగం'లో కనిపించాడు. ఇందులో ఆర్య ప్రధాన పాత్రలో నటించారు. ఎం ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధి ఇద్నాని, కె భాగ్యరాజ్, అడుకలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం అభిమానులు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ నటీనటుల ప్రదర్శనలకు ప్రశంసలు దక్కాయి.