గ‌ర్వంగా కొడుకుని ప‌రిచ‌యం చేసిన ప్ర‌భుదేవా

ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ గా పేరొందిన ప్ర‌భుదేవా రీసెంట్ గా చెన్నైలో ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రోగ్రామ్ నిర్వ‌హించాడు.

Update: 2025-02-26 11:50 GMT

ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ గా పేరొందిన ప్ర‌భుదేవా రీసెంట్ గా చెన్నైలో ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రోగ్రామ్ నిర్వ‌హించాడు. ప్ర‌భుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ పేరుతో ఓ కాన్స‌ర్ట్ ను నిర్వ‌హించాడు. ఈ ఈవెంట్ కు ఎంతో మంది సినీ సెల‌బ్రిటీలు హజ‌ర‌య్యారు. అయితే ఈ కాన్స‌ర్ట్ లో ప్ర‌భుదేవా త‌న కొడుకు రిషి రాగ్వేంద‌ర్‌ను ప్ర‌భుదేవా ఆడియ‌న్స్ కు ప‌రిచ‌యం చేశాడు.

త‌న కొడుకు ఫ‌స్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశాడు ప్రభుదేవా. నా కొడుకు రిషి రాగ్వేంద‌ర్ దేవాను ప‌రిచ‌యం చేయ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని, మేమిద్దరం క‌లిసి స్టేజ్ షేర్ చేసుకోవ‌డం ఇదే మొద‌టిసారి అని, ఇది కేవ‌లం ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్ర‌మే కాద‌ని, అంత‌కంటే ఎక్కువ‌ని, ఇది త‌న వార‌స‌త్వ‌మ‌ని, ఇప్పుడే మొద‌లవుతున్న జ‌ర్నీ అని ప్ర‌భుదేవా వీడియోను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చాడు.

ఇదిలా ఉంటే ప్రభుదేవాకు ఇద్ద‌రు పిల్లలుండ‌గా అందులో ఒక‌రు రిషి రాగ్వేంద‌ర్, మ‌రొక‌రు అదిత్. ఈ వీడియోను చూసిన ఆయ‌న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రిషి రాగ్వేంద‌ర్ దేవా తో ప్ర‌భుదేవా కాలు క‌ద‌ప‌డం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారంతా రిషి అచ్చం ప్ర‌భుదేవా లానే ఉన్నాడ‌ని, ఆయ‌న‌లానే డ్యాన్స్ చేస్తున్నాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్ర‌భుదేవా విష‌యానికొస్తే ఆయ‌న యాక్ట‌ర్ గా, కొరియోగ్ర‌ఫ‌ర్ గా, డైరెక్ట‌ర్ గా ప‌లు రంగాల్లో రాణిస్తున్నాడు. ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్ర‌ఫీ చేసిన ప్ర‌భుదేవా, తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆయ‌న మొన్న చెన్నైలో చేసిన కాన్స‌ర్ట్ కు అల‌నాటి హీరోయిన్లు కూడా హాజ‌రై ప్ర‌భుదేవాతో కాలు క‌దిపిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News