త్రివిక్రమ్ ఇంట్లో ప్రదీప్ ఫ్యాన్స్..!

యాంకర్ ప్రదీప్ బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అదేంటో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అంటే అది ఏ షో అయినా సూపర్ హిట్ అయ్యేది;

Update: 2025-04-07 16:16 GMT
త్రివిక్రమ్ ఇంట్లో ప్రదీప్ ఫ్యాన్స్..!

యాంకర్ ప్రదీప్ బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అదేంటో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అంటే అది ఏ షో అయినా సూపర్ హిట్ అయ్యేది. యాంకర్ గా తన క్రేజ్ ని కొనసాగిస్తూ వచ్చిన ప్రదీప్ సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేశాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో వస్తున్నాడు.

ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రదీప్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఐతే ప్రదీప్ స్మాల్ స్క్రీన్ పై బిజీ అవ్వకముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. అందులో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జులాయి, అత్తారింటికి దారేది ఉన్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో ప్రదీప్ కి అసలు డైలాగ్స్ ఉండవు. ఆ సినిమా చూసిన త్రివిక్రం ఫ్యామిలీ మెంబర్స్ ఆ అబ్బాయి మంచిగా మాట్లాడతాడు అతనికి డైలాగ్స్ ఎందుకు ఇవ్వలేదని అడిగారట. ఆ విషయాన్ని త్రివిక్రమ్ తనకు చెప్పారని ప్రదీప్ వెల్లడించాడు. త్రివిక్రమ్ తన సినిమాలో ఒక మంచి రోల్ అది నీకు పర్ఫెక్ట్ అనిపిస్తే కచ్చితంగా ఇస్తానని అన్నారట. ఐతే అలాంటి ఒక మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అని చెప్పుకొచ్చాడు ప్రదీప్.

ప్రదీప్ ప్రతి ఇంట్లో మనిషి అనుకుంటారు. ఎందుకంటే రోజు మొత్తం మీద ఏదో ఒక షోలో ఎలానో ఒకలా ఇంట్లో ఒక మెంబర్ లా వారిని అలరిస్తుంటాడు. అందుకే ప్రదీప్ కి ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎక్కువ. ఐతే అదే తన మొదటి సినిమా సక్సెస్ కు కారణమైంది. ఇక ఇప్పుడు తన సెకండ్ అటెంప్ట్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చేస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ గా నటించింది. సినిమా కోసం అమ్మడు చాలా కష్టపడినట్టే ఉంది. సినిమాలో తన పాత్ర చాలా ట్రడిషనల్ గా అనిపిస్తున్నా పాటల్లో ఒక రేంజ్ లో రెచ్చిపోయినట్టు ఉంది. ప్రదీప్ తో పాటు దీపిక కూడా స్మాల్ స్క్రీన్ పై అలరించింది. మరి వీరి బుల్లితెర ఫ్యాన్స్ ఈ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమాను సక్సెస్ చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News