ముగ్గురు భామల మధ్యలో జూనియర్ ధనుష్!
యంగ్ హీరో ప్రదీప్ రంగనాధ్ అలియాస్ జూనియర్ ధనుష్ ఇప్పుడు తెలుగింట ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు.;
యంగ్ హీరో ప్రదీప్ రంగనాధ్ అలియాస్ జూనియర్ ధనుష్ ఇప్పుడు తెలుగింట ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమా `లవ్ టుడే`...ఇటీవల రిలీజ్ అయిన `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` తో రెండు యూత్ ఫుల్ విజయాలతో యువతలో క్రేజీగా హీరోగా మారిపోయాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ రంగనాధ్ ని నెత్తిన పెట్టుకున్నారు. ఇకపై జూనియర్ ధనుష్ మంచి కంటెంట్ ఉన్న ఎలాంటి సినిమా చేసినా? ఆదరణకు ఏ మాత్రం దక్కదని...అంతకంతకు అతడి ఇమేజ్ రెంట్టిపు అవుతుంది.
ఇప్పటికే ప్రదీప్ రంగనాధ్ తో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా కూడా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ్ లో ఈ చిత్రాన్ని కీర్తీ శ్వరన్ అనే కొత్త కుర్రాడు తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ చిత్రం. 30 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో ప్రదీప్ కి జంటగా ముగ్గురు భామలు నటిస్తున్నారుట. ఓ భామగా ఇప్పటికే మమితా బైజు ఫైనల్ అయింది.
మిగిలిన రెండు పాత్రల్లో అను ఇమ్మాన్యేయేల్, ఐశ్వర్యా శర్మ ను ఎంపిక చేసినట్లు సమాచారం. మొత్తానికి ప్రదీప్ రంగనాధ్ మూడవ సినిమాల్లో రొమాంటికో బోయ్ గానే కనిపిస్తాడని తెలుస్తొంది. తొలి సినిమాలో లెక్కలేనంత మంది గాళ్ ప్రెండ్స్ ఉంటారు. రెండవ చిత్రంలోనూ ఇద్దరితో రొమాన్స్ చేస్తాడు. మూడవ సినిమాలో ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకొస్తున్నారు. రంగనాధ్ బాడీ లాంగ్వేజ్ కి యూత్ ఫుల్ స్టోరీలు సరిగ్గా సెట్ అవుతున్నాయి.
నవతరం దర్శకులు కూడా అతడి ఇమేజ్ ని బేస్ చేసుకునే స్టోరీలు సిద్దం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు తెచ్చేవి కూడా ఈ తరహా కాన్సెప్ట్ లేదు. ఇలాంటి హీరోతో ఐదు కోట్ల బడ్జెట్ లో సినిమా చుట్టేయోచ్చు. లవ్ టుడే...డ్రాగన్ చిత్రాలు అలా చేసినవే. హిట్ అవ్వడంలో నిర్మాతలకు భారీ ఎత్తున లాభాలు వచ్చాయి. దీంతో మైత్రీ నిర్మాతలు మరో ఆలోచన లేకుండా లాక్ చేసి ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు.