ఎగ్జామ్స్ లో కథలు రాసి దొరికిపోయిన హీరో
టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమాతో ఊహించని క్రేజ్ ను అందుకున్నాడు.
టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమాతో ఊహించని క్రేజ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. గ్యాప్ లేకుండా వరుస షూటింగులతో బిజీబిజీగా ఉన్న ప్రదీప్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
ప్రదీప్ నటించిన డ్రాగన్ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అశ్వత్ మరిమత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాద్ లోహల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా రిటర్న్ ఆఫ్ డ్రాగన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రదీప్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ప్రదీప్ తాజాగా తన ఎక్స్ అకౌంట్ లో ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు. బీటెక్ చదివే రోజుల్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఆన్సర్ కు బదులు కథలు రాసిన ప్రదీప్, లెక్చరర్ కు దొరికిపోగా, లెక్చరర్ ఆ కథ చూసి బాగా ట్రై చేశావు, కానీ దయచేసి ఇలాంటి కథలు రాయొద్దు ప్రదీప్ అని పేపర్ మీద రాశారు.
ఆ ఎగ్జామ్ లో ప్రదీప్ కు 50 కు పదకొండున్నర మార్కులే వచ్చాయి. ఆ మార్కులున్న పేపర్ ను ఫోటో తీసి దాన్ని ప్రదీప్ ఇప్పుడు ఎక్స్ లో షేర్ చేస్తూ టీచర్ ఎగ్జామ్స్ లో కథలు రాయొద్దని చెప్పారని, అందుకే కథలు రాయడాన్నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నానని ప్రదీప్ ఈ సందర్భంగా రాసుకొచ్చాడు. అంతేకాదు తనకొచ్చిన పదకొండున్నర మార్కులు యూనిట్ టెస్ట్ లో అని, మెయిన్ ఎగ్జామ్స్ కు బాగానే చదివి ఎగ్జామ్స్ రాసినట్టు ప్రదీప్ తెలిపాడు.
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రదీప్, డైరెక్షన్ తో పాటూ యాక్టింగ్, ఎడిటింగ్ పైన కూడా ఫోకస్ చేశాడు. ప్రదీప్ షార్ట్ ఫిల్మ్ చూసిన జయం రవి డైరెక్టర్ గా తనకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే డ్రాగన్ కాకుండా ప్రదీప్ ఆల్రెడీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీని చేస్తున్నాడు. సై- ఫై రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.