అప్పుడు రిక్వెస్ట్.. ఇప్పుడు పోటీ.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా!

ఎవరి లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సినీ సెలబ్రిటీల విషయంలో అయితే ఇంకాస్త వెరైటీగా ఉంటుంది.

Update: 2025-02-27 00:30 GMT

ఎవరి లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సినీ సెలబ్రిటీల విషయంలో అయితే ఇంకాస్త వెరైటీగా ఉంటుంది. సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేస్తుంటారు. ఒక్కసారిగా పాపులర్ అయిపోతుంటారు. ఇంకొందరు కష్టపడి పైకొచ్చి ఒక్కసారిగా అనుకోని విజయం సాధిస్తారు. స్టార్ నటీనటులతోనే పోటీపడతారు.

రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ విషయంలో అదే జరిగిందనే చెప్పాలి. రీసెంట్ గా ఆయన.. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైంది. తొలి షో నుంచి పాజిటివ్ అందుకుని దూసుకుపోతోంది.

అయితే అదే రోజు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా థియేటర్లలో రిలీజ్ అయింది. రెండు సినిమాలు కూడా యూత్ ను టార్గెట్ చేసినా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పాజిటివ్ రివ్యూస్ అందుకుంటోంది. ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటోంది.

దీంతో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ విన్నర్ అని అంతా అంటున్నారు. అదే సమయంలో ఎనిమిదేళ్ల క్రితం ప్రదీప్ చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో ప్రదీప్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి, బడా సెలబ్రిటీల దృష్టిని ఆకర్షించడానికి నెట్టింట సందడి చేశారు. తన షార్ట్ ఫిల్మ్ చూడాలని ధనుష్‌ ను ట్యాగ్ చేశారు.

ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద ధనుష్ తోనే పోటీ పడ్డారు ప్రదీప్. దీంతో నెటిజన్లు ఫుల్ గా కామెంట్లు పెడుతున్నారు. ఇది కదా లైఫ్ అని అంటున్నారు. అప్పుడు షార్ట్ ఫిల్మ్ చూడమని రిక్వెస్ట్ చేసి.. ఇప్పుడు ఆయనతోనే పోటీ పడ్డారని చెబుతున్నారు. యంగ్ జనరేషన్ కు ప్రదీప్ రంగనాథన్ ఇన్సిపిరేషన్ గా నిలుస్తారని అంటున్నారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు ప్రదీప్. ఆ తర్వాత అక్కడి స్టార్ హీరో జయం రవిని ఇంప్రెస్ చేసి కోమాలి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. అనంతరం తనకు సరిపడా కథ రాసుకుని లవ్ టుడే రూపంలో పెద్ద హిట్ సాధించారు. చిన్న గ్యాప్ తీసుకుని రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ కొట్టారు.

Tags:    

Similar News