మైత్రీతో చేతులు క‌లిపిన ప్ర‌దీప్!

ఇందులో భాగంగానే మైత్రీ సంస్థ ఓ బైలింగువ‌ల్ సినిమాను ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ల‌వ్ టుడే, డ్రాగ‌న్ సినిమాల‌తో మంచి హిట్లు అందుకున్న ప్ర‌దీప్ రంగ‌నాథన్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ సినిమా చేయ‌నుంద‌ని మొన్నీ మ‌ధ్య వార్త‌లొచ్చిన విష‌యం తెలిసిందే.

Update: 2025-02-23 12:59 GMT

మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాణ సంస్థ గా పేరు సంపాదించుకుంది. మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన శ్రీమంతుడు మూవీతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన మైత్రీ నిర్మాత‌లు అతి త‌క్కువ కాలంలోనే మంచి అభిరుచి ఉంద‌ని నిరూపించుకున్నారు. మైత్రీ నుంచి సినిమా వ‌స్తుందంటే అంద‌రి దృష్టి ఆ సినిమాపైనే ఉండే స్థాయికి ఆ నిర్మాణ సంస్థ ఎదిగింది.

దాదాపు టాలీవుడ్ లోని అగ్ర హీరోలంద‌రితో సినిమాలు చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇటీవలే పుష్ప‌2 తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకుంది. పుష్ప‌2 త‌ర్వాత మైత్రీ స్థాయి మ‌రింత పెరిగింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం తెలుగులోనే కాకుండా తమిళ‌, హిందీ భాష‌ల్లో కూడా మైత్రీ సంస్థ సినిమాల‌ను నిర్మిస్తుంది.

ఇందులో భాగంగానే మైత్రీ సంస్థ ఓ బైలింగువ‌ల్ సినిమాను ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ల‌వ్ టుడే, డ్రాగ‌న్ సినిమాల‌తో మంచి హిట్లు అందుకున్న ప్ర‌దీప్ రంగ‌నాథన్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ సినిమా చేయ‌నుంద‌ని మొన్నీ మ‌ధ్య వార్త‌లొచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడా విష‌యాన్ని డ్రాగ‌న్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా స్వ‌యంగా ప్ర‌దీపే వెల్ల‌డించాడు.

ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌దీప్ తెలిపాడు. ఇప్ప‌టికే 20 రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందనుంది. ఈ క‌థ చాలా బాగా వ‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ గా ఈ ప్రాజెక్టు అనౌన్స్ కానుంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మైత్రీ ఇప్ప‌టికే త‌మిళంలో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తీస్తుండ‌గా, హిందీలో స‌న్నీ డియోల్ తో జాత్ ను నిర్మిస్తోంది. పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా డైరెక్ట‌ర్ లాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌మ బ్యాన‌ర్ ను పాన్ ఇండియా స్థాయిలో నిల‌బెట్టాల‌నే ధ్యేయంతోనే ఇలా అన్ని భాష‌ల్లో సినిమాల‌ను చేస్తున్న‌ట్టున్నారు నిర్మాత‌లు.

Tags:    

Similar News