ప్రదీప్ రంగనాథన్.. నెక్స్ట్ రెండు కొంచెం కష్టమే?

ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే వాటితో సక్సెస్ కొట్టడం అంత ఈజీ కాదు.;

Update: 2025-02-28 03:47 GMT

ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, కోలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత బలపర్చుకున్నాడు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు తమిళ, తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందింది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు పెరిగాయి. దీంతో కంటెంట్ అంతకుమించి అనేలా ఉంటేనే ఆడియెన్స్ మళ్ళీ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. వరుసగా బాక్సాఫీస్ వద్ద రెండు హిట్స్ అందుకున్న ప్రదీప్, మరికొన్ని ప్రాజెక్ట్‌లతో తన మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ రెండు సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే వాటితో సక్సెస్ కొట్టడం అంత ఈజీ కాదు. లవ్ ఇన్సూరెన్స్ కంపనీ అనే సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి నయన్ భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా, 2024 సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా విగ్నేష్ కు సరైన విజయాలు లేవు. అతనికి కూడా ఈ సినిమా హిట్టవ్వడం చాలా ముఖ్యం.

ఇదే సమయంలో ప్రదీప్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సుధ కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ డైరెక్టర్ కు ఇది మొదటి సినిమా కావడంతో ప్రమోషన్ కంటెంట్ తోనే ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎక్కువుంది. మొదటి రెండు సినిమాలు మొదట్లోనే డిఫరెంట్ కంటెంట్ తో ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించాయి. ఇక ప్రమోషన్ లో ప్రదీప్ తీసుకున్న జాగ్రత్తలు కూడా వర్కౌట్ అయ్యాయి.

అయితే కీర్తీశ్వరన్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది కాబట్టి తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడం గ్యారెంటీ. రాబోయే రెండు సినిమాలు అతనికి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్ట్రాంగ్ గా నిలబెట్టే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో కోలీవుడ్‌లో కొత్త తరహా సినిమాలతో, విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ప్రదీప్ రంగనాథన్ ప్రత్యేకతగా మారింది. లవ్ టుడే సినిమాతో ఘన విజయం సాధించిన తర్వాత డ్రాగన్ సినిమాతో అదే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.

కేవలం నటుడిగానే కాకుండా, కథల ఎంపికలో స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా వేరే దర్శకులతో కలిసి పని చేస్తూ, విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం గమనార్హం. ఇక రాబోయే రెండు కొత్త ప్రాజెక్ట్‌లపై ఈజీగా అంచనాలు పెరగడం గ్యారెంటీ. కాబట్టి అతనికి కంటిన్యూగా అదే రేంజ్ లో హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. లవ్ ఇన్సూరెన్స్ కంపనీ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా, కీర్తీశ్వరన్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా డిఫరెంట్ యూనిక్ పాయింట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న రెండు సినిమాలు వరుస విజయాలను అందుకుంటే, ప్రదీప్ రంగనాథన్ కోలీవుడ్ టైర్-2 హీరోలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News