డ్రాగన్ హీరో లక్ అలా ఉంది..!
తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ కూడా అదరగొట్టేస్తున్నాయని తెలుస్తుంది.;
కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడేతో హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా తన ప్రతిభ చాటుకున్న అతను రీసెంట్ గా డ్రాగన్ అదే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ కూడా అదరగొట్టేస్తున్నాయని తెలుస్తుంది. ఐతే డ్రాగన్ హీరో టాలెంట్ గుర్తించిన మైత్రి మూవీ మేకర్స్ అతనితో సినిమా లాక్ చేసుకుంది. ఆ కారణంగానే డ్రాగన్ ని తెలుగులో రిలీజ్ చేశారు.
ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఎల్.ఐ.కె సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా యూత్ ఫుల్ కథతో క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ కూడా ప్రదీప్ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. యూత్ ఆడియన్స్ కు నచ్చే కథలతో ప్రదీప్ చేస్తున్న ప్రయత్నాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. లవ్ టుడే తోనే తన సత్తా ఏంటో చూపించిన ప్రదీప్ రంగనాథ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో మరోసారి అదరగొట్టేశాడు.
ఇదిలా ఉంటే ప్రదీప్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ మమితా బైజు నటిస్తుందని తెలుస్తుంది. ప్రేమలు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మమితా బైజు సౌత్ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. ఐతే అలాంటి అమ్మడు యూత్ హీరో ప్రదీప్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం క్రేజీగా మారింది. తను తీసే సినిమాలతో యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాతో ఎలాంటి కిక్ ఇస్తాడో చూడాలి. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు ప్రదీప్. చూస్తుంటే తెలుగులో ఇతను కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. ప్రదీప్ రంగనాథ్ సినిమాలన్నీ యూత్ టార్గెట్ తోనే వస్తున్నాయి. ప్రతి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అదరగొట్టేస్తున్న ఈ యువ హీరో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు.