అచ్యుత్ మరణంపై ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అలాంటి నటుడు హఠాన్మరణంతో ప్రేక్షకాభిమానుల్ని ఎంతగా శోకసంద్రంలో ముచ్చిందో తెలిసిందే.
టీవీ ఆర్టిస్ట్....సినిమా నటుడు అచ్యుత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బుల్లి తెరపై హీరోగా ఓవెలుగు వెలిగిన నటుడు. ఎన్నో సీరియళ్లల నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో సైతం కీలక పాత్రలతో మెప్పించిన నటుడు. ఆరోజుల్లోనే టీవీ ఆర్టిస్ట్ గా అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా అచ్యుత్ కి పేరుంది. అలాంటి నటుడు హఠాన్మరణంతో ప్రేక్షకాభిమానుల్ని ఎంతగా శోకసంద్రంలో ముచ్చిందో తెలిసిందే.
అయితే అచ్యుత్ మరణంపై అప్పట్లో చాలా రకాల కథనాలు వైరల్ అయ్యాయి. తాజాగా వాటిపై అచ్యుత్ స్నేహితుడు ప్రదీప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. `అచ్యుత్ తో చాలా క్లోజ్ గా ఉండేవాడని. దాదాపు ఇద్దరిది 14 ఏళ్ల స్నేహం. అచ్యుత్ కి నాన్ వెజ్ బాగా తినే అలవాటుంది. మా ఇంటికొచ్చి కూడా పిల్లలతో కలిసి భోజనం చేసేవాడు. ఒక్కసారిగా తినడం మానేసాడు. తర్వాత కోక్ లు తాగడం మొదలు పెట్టాడు. అచ్యుత్ ది సహజ మరణం. నాకంటే సర్టిఫై చేసే వారు ఎవరూ లేరు. చనిపోవడానికి ముందు రోజు మా ఆఫీస్ కి వచ్చాడు.
'మట్టిమనుషులు' సీరియల్ చేస్తున్నాం. ఆ సాయంత్రం అన్నా నేను తిరుపతి వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్లు అని చెప్పాను. కానీ అప్పుడు కొంచెం అయేసపడుతున్నాడు. ఏమైంది అంటే నాకు కొంచెం నోరు పూసింది. ఇప్పుడే ఎండో స్కోపీ చేయించుకోచ్చా అన్నాడు. సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పా. తర్వాత రోజు మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లగానే అచ్యుని ఆసుపత్రిలో జాయిన్ చేసారన్నారు. ఎందుకంటే హార్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు...మురళీ మోహన్ గారు అంతా వచ్చారు.
కార్డియాక్ అరెస్ట్ సివియర్ గా ఉంది. ఓ ఇంజెక్షన్ ఇచ్చి ట్రై చేద్దాం అన్నారు. అప్పుడు అచ్యుత్ వైఫ్ ఒక్కరే అక్కడ కూర్చుని ఉన్నారు. ఇలాంటి కష్టంగానీ..శాపంగా మరే స్నేహితుడికి రాకూడదనుకున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి కి నేను వెళ్లి మీ అచ్యుత్ విషయంలో నిల్ హోప్స్ అని నేను చెప్పాల్సి వచ్చింది. అతడిది సహజ మరణం. రకరకాలగా వచ్చిన కారణాలన్ని అవాస్తవం. అప్పటికే మంచి ఫాంలో ఉన్నాడు. ఛానళ్లు వాళ్లు చంపించాల్సిన పనిలేదు.
ఆత్మ హత్య చేసుకునే కష్టాలు తనకి లేవు. అవన్ని తప్పుడు కథనాలు. అలాంటి తప్పుడు కథనాల్ని ఖండిస్తున్నాను. మామూలోడికి ఏమైనా ఎవరూ పట్టించుకోరు. కానీ పేరున్న వాళ్లకి ఇలా జరిగితే రకరకాల ఊహాగానాలొచ్చేస్తాయి. అతడికి పూర్తిగా నేచురల్ డెత్. చాలా మంచి వాడు. ఏడాది పాటు అతడి మరణాన్ని జీర్ణించుకో లేకపోయాను. ఇప్పటికీ కళ్లంట నీళ్లు వస్తాయి. లౌక్యాలు..బ్రతక నేర్చిన తెలివి తేటలు వంటివి లేనివాడు` అని అన్నారు.