ప్రగ్యా కొత్త లుక్.. మతి చెడిపోవాలంతే
మెగా ఫ్యామిలీ హీరోతో తెరంగేట్రం చేసినా కానీ ఎందుకనో ఈ బ్యూటీకి తెలుగు అగ్ర హీరోలతో అవకాశాలు రాలేదు.
కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. తెలుగు, హిందీ సినీరంగాల్లో ఈ ముంబై భామ అలుపెరగని ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన విధంగా కెరీర్ షేపప్ అవ్వలేదు. పెద్ద స్టార్ అవ్వాలని కలలుగన్నా, మెగా ఫ్యామిలీ హీరోతో తెరంగేట్రం చేసినా కానీ ఎందుకనో ఈ బ్యూటీకి తెలుగు అగ్ర హీరోలతో అవకాశాలు రాలేదు. నందమూరి బాలకృష్ణ, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు అవకాశాలు కల్పించినా కానీ, ఆ హీరోల క్రేజ్ ముందు ప్రగ్య ప్రదర్శనకు గుర్తింపు దక్కలేదు.
కారణం ఏదైనా కెరీర్ జర్నీలో ఈ భామ ఆశించిన రేంజును అందుకోలేకపోయింది. అయినా నిరాశ చెందక ప్రగ్యా నిరంతర ప్రయత్నాలు, పాజిటివిటీ ఎప్పుడూ అభిమానులను ఆకర్షిస్తాయి. పడిన చోటే వెతుక్కోవడం.. ఎప్పటికైనా జాక్ పాట్ తగులుతుందనే ఆశావాదం ప్రగ్యాలో పాజిటివిటీని గుర్తు చేస్తాయి. ఇప్పటికీ ఈ బ్యూటీ తెలుగు ఫిలిం సర్కిల్స్ లో అవకాశాల వేట సాగిస్తూనే ఉంది. ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
మరోవైపు సోషల్ మీడియాల్లో నిరంతరం తన అభిమానులను యంగేజ్ చేయడంలో ప్రగ్య దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రగ్య నిరంతర బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇదే కేటగిరీలో ఇప్పుడు మరో బోల్డ్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ప్రగ్య అల్ట్రా స్టైలిష్ డిజైనర్ లుక్ తో మతులు చెడగొడుతోంది.
ఈ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసిన ప్రగ్య ''నేను నా దుస్తులతో ఆడుకోవటాన్ని ఆనందించానని మీరు చెప్పలేరా?'' అంటూ టీజ్ చేసింది. ITA అవార్డుల కోసం ఈ దుస్తులను ధరించినట్టు తెలిపింది. @anshikaav స్టైలింగ్ చేసారని తెలిపింది. ప్రస్తుతం ఈ కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ప్రగ్య 2024 ఆగస్టులో విడుదలైన 'ఖేల్ ఖేల్ మై' చిత్రంలో కనిపించింది. కానీ అక్షయ్ కుమార్, వాణి కపూర్, తాప్సీ లాంటి స్టార్ల నడుమ ఈ అమ్మడికి అంతగా గుర్తింపు దక్కలేదు.