ప‌వ‌న్ (X) ప్ర‌కాష్ రాజ్: ఒక‌రు స‌నాత‌నం.. ఒక‌రు సమాన‌త్వం

ఎక్స్ ఖాతాలో ప్ర‌కాష్ రాజ్ తాజా వ్యాఖ్య వేడెక్కిస్తుండ‌గానే, చెన్నైలోని ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేసాడు

Update: 2024-10-06 06:27 GMT

సనాతన ధర్మం ఇప్పుడు బ‌ర్నింగ్ టాపిక్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా స‌నాత‌న ధ‌ర్మంపై నిబ‌ద్ధ‌త గురించి మాట్లాడుతుంటే అది గిట్ట‌నివాళ్లు, ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నారు. ఈ జాబితాలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఒక‌రు. ఎక్స్ ఖాతాలో ప్ర‌కాష్ రాజ్ తాజా వ్యాఖ్య వేడెక్కిస్తుండ‌గానే, చెన్నైలోని ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేసాడు.

``త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి స్టాలిన్ స‌మాన‌త్వం గురించి మాట్లాడుతుంటే, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌నం అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. మాది స‌మాన‌త్వం. దీనికి క‌ట్టుబ‌డి ఉన్నాను`` అని ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నేను ప్ర‌శ్నిస్తే భ‌య‌ప‌డుతున్నారు. నేను ఎప్ప‌టికీ బ‌ల‌హీన వ‌ర్గాల త‌ర‌పున మాట్లాడుతాను అని అన్నారు.

X వేదికగా రాజకీయ ప్రముఖులు వ‌ర్గ వైష‌మ్యాల గురించి తన అభిప్రాయాలను సూటిగా వ్య‌క్తం చేయ‌డం ప్ర‌కాష్ రాజ్ అల‌వాటు. తన ట్వీట్‌లో, ``సనాతన ధర్మ రక్షణలో ఉండండి. మేము సామాజిక రక్షణలో ఉన్నాము. ఆల్ ది బెస్ట్ .. జ‌స్ట్ ఆస్కింగ్‌`` అని ఇంత‌కుముందు వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన సున్నితమైన సామాజిక సమస్యలపై స్పందించే ప్ర‌కాష్ రాజ్ త‌త్వాన్ని ఆవిష్క‌రిస్తోంది.

ఆలయంలో పవిత్ర నైవేద్యమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .. ప‌లువురు విమ‌ర్శ‌కుల మ‌ధ్య‌ తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్ కళ్యాణ్ ఈ సమస్యను సనాతన ధర్మంపై దాడిగా సూచించారు. హిందూ మనోభావాలకు బలమైన రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. దీనికి విరుద్ధంగా సంచలనాత్మక వాక్చాతుర్యంతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కంటే వాదనలను దర్యాప్తు చేయడంపై దృష్టి పెట్టాలని ప్ర‌కాష్‌ రాజ్ కోరారు. ఈ ఘర్షణ రాజకీయంగా ఆవేశపూరిత వాతావరణంలో మతపరమైన భావాలను రెచ్చ‌గొడుతుంద‌ని అన్నారు.

గతంలో సనాతన ధర్మంపై తన వైఖరి గురించి ప్ర‌కాష్ రాజ్ గళం విప్పారు. దానిని రాజకీయ సాధనంగా ఉపయోగించే వారు నిజంగా హిందూ విలువలకు ప్రాతినిధ్యం వహించరని నొక్కి చెప్పారు. హిందుత్వ దూకుడు ప్రతిపాదకులను వారి స్వలాభం కోసం మతపరమైన భావాలను ఉపయోగించుకునే `కాంట్రాక్టర్లు`గా ఆయన వర్ణించారు.

Tags:    

Similar News