మోహన్‌లాల్ కొడుకు ఫస్ట్ మాస్ మూవీ ఇదే అవుతుందా?
లాలిటన్‌గా ముద్దుగా పిలుచుకునే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ `ఎంపురాన్ 2`.;

లాలిటన్‌గా ముద్దుగా పిలుచుకునే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ `ఎంపురాన్ 2`. క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. `లూసీఫర్`కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ రీసెంట్‌గా విడుదలై వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఎపిసోడ్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీని మరోసారి సెన్సార్ చేసి కొత్త వెర్షన్‌ని తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు.
మల్లూవూడ్‌లో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ మోహన్‌లాల్ కెరీర్‌లో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న ఈ మూవీ ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్‌ని తెరకెక్కిస్తామంటూ మేకర్స్ చివర్లో ప్రకటించారు. టైటిల్‌ని కూడా రివీల్ చేయడం తెలిసిందే. `ఎల్ 3 ది బిగినింగ్` పేరుతో దీన్ని తెరపైకి తీసుకురానున్నారు.
అయితే ఇందులో హీరోగా మోహన్‌లాల్ నటించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రీక్వెల్‌లో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా కనిపించబోతున్నాడు. 1982 ప్రాంతంలో అబ్రహం ఖురేషీ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ లూసీఫర్ ముంబై నగరంలో ఏం చేశాడు? ప‌్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మాఫియాని ఎలా తను శాసించాడు అనే స్టోరీ లైన్‌తో పార్ట్ 3ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఎ2 ఎండింగ్‌లో రక్తంతో కనిపించిన యువకుడే ప్రణవ్.
1982 ప్రాంతంలో అబ్రహం ఖురేషి అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ లూసిఫర్ ముంబై నగరానికి వచ్చి ఏం చేశాడు, ప్రపంచమంతా విస్తరించే మాఫియాని ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాడనే పాయింట్ మీద చాలా ఇంటెన్స్ గా తీస్తారట. ఎల్2 ఎండ్ టైటిల్స్ ముందు చూపించిన ఎపిసోడ్ లో రక్తంతో కనిపించిన యువకుడు ప్రణవే. ఇంటెన్స్ లుక్‌తో కనిపించిన ప్రణవ్‌ని మాస్ హీరోగా ఎలివేట్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ మోహన్ లాల్‌గా ప్రణవ్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు.
ప్రణవ్ హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఇందులో 2022లో విడుదలైన `హృదయం` బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రణవ్ `ఎ3`తో సంచలనం సృష్టించి మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇందులో యంగ్ మోహన్ లాల్‌గా ప్రణవ్ కనిపించి అదరగొట్టబోతున్నాడని మల్లూవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందులో ప్రణవ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.