సలార్ 2.. రెబల్ ఫ్యాన్స్ కి జాతర కన్ఫర్మా..?

కానీ సలార్ 1 సీజ్ ఫైర్ ని రెబల్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే మాస్ ఎలివేషన్స్ తో సంచలనం సృష్టించాడు.

Update: 2024-12-22 10:14 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా అనగానే సలార్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కె.జి.ఎఫ్ లో యష్ ని చూపించిన దాని కన్నా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడు అని డౌట్ పడ్డారు. కానీ సలార్ 1 సీజ్ ఫైర్ ని రెబల్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే మాస్ ఎలివేషన్స్ తో సంచలనం సృష్టించాడు. ఐతే సలార్ 1 వచ్చి ఏడాది అవుతుంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

సలార్ 1 ఏడాది పూర్తైన సందర్భంగా సలార్ 2 గురించి సలార్ 1 సీన్స్ గురించి ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సలార్ 1 గురించే కాదు సలార్ 2 ఎలా ఉండబోతుంది అన్న దాని మీద కూడా చెప్పారు. సలార్ 2 సినిమా తన కెరీర్ లో బెస్ట్ వర్క్ గా ఉండబోతుందని అన్నారు. ఇద్దరు ఇన్నోసెంట్ పీపుల్ మధ్య ఉన్న స్నేహం వైరం గా ఎలా మారింది అన్నది సలార్ కథ అని. ఐతే తాను ముందు సినిమాను ఒక భాగంగా పూర్తి చేయాలని అనుకున్నా సినిమా తీస్తున్న టైం లో రెండు భాగాలుగా ఫిక్స్ అయ్యామని అన్నారు.

ఇక సలార్ కథలో ప్రభాస్ కి క్లైమాక్స్ చాలా ఇష్టమని. సినిమా చర్చల్లో ఉన్న టైం లో ప్రభాస్ ఇచ్చిన సలహా సినిమా రూపురేఖలనే మార్చేశాయని ఇంటర్వ్యూలో చెప్పారు ప్రశాంత్ నీల్. సినిమా అంతా కూడా ఒకే ఎమోషన్ క్యారీ అవుతుందని. ఇద్దరి ఇన్నోసెంట్ పీపుల్ మధ్య వైరం ఎలా ఉంటుందో చూస్తారని.. సలార్ 2 తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అవుతుందని అన్నారు ప్రశాంత్ నీల్.

సలార్ 1 తర్వాత సలార్ 2 బదులుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. తారక్ తో చేస్తున్న సినిమా ఒక భాగంగా ఉంటుందా లేదా రెండు భాగాలా అన్నది తెలియలేదు. సలార్ 2 కి మాత్రం ప్రశాంత్ నీల్ ఇస్తున్న ఎలివేషన్ రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుంది. సలార్ 2 శౌర్యాంగ పర్వం క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని రెబల్ ఫ్యాన్స్ కి మాస్ ఫీట్ పక్కా అన్నట్టు తెలుస్తుంది.

Full View
Tags:    

Similar News