'మజాకా' కథ చిరుకు నచ్చినా..

దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడలది టాలీవుడ్లో సూపర్ హిట్ కాంబినేషన్.

Update: 2025-01-13 17:30 GMT

దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడలది టాలీవుడ్లో సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా ఘన విజయం సాధించాయి. ఇప్పుడీ ద్వయం నుంచి ‘మజాకా’ సినిమా రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్ ముఖ్య పాత్ర పోషించారు. నిన్న రిలీజైన ‘మజాకా’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సూపర్ హిట్ వైబ్స్ కనిపించాయి టీజర్లో. ఆసక్తి రేకెత్తించే విషయం ఏంటంటే.. ఈ కథ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిందట. ఇందులో రావు రమేష్ చేసిన పాత్రను చేయడానికి చిరు ఆసక్తి చూపించారట. ఈ విషయాన్ని టీజర్ లాంచ్ సందర్భంగా రైటర్ ప్రసన్న కుమార్ చెప్పడం విశేషం. ఐతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఆయన చేయలేకపోయినట్లు ప్రసన్న వెల్లడించాడు.

‘భోళా శంకర్’ తర్వాత ఏ సినిమా చేయాలా అనే డైలమాలో ఉన్న టైంలో చిరు కొన్ని కథలు విన్నారు. అప్పుడు ప్రసన్న కుమార్ సైతం చిరు కోసం ఒక కథ రెడీ చేస్తున్నట్లు, చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయమై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘మజాకా కథలో రావు రమేష్ గారు చేసిన పాత్రను ముందు ఆయన్ని దృష్టిలో పెట్టుకునే రాశాం. ఐతే ఒక ఫ్రెండు ఈ కథ విని ఇది చిరంజీవి గారికి సూటవుతుందని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. చిరంజీవి గారికి కూడా ఈ కథ, పాత్ర నచ్చాయి. కొంత మేర డిస్కషన్లు జరిగాయి. కానీ వేరే కారణాల వల్ల ఈ సినిమా చేయడం కుదరలేదు. దీంతో మళ్లీ ముందు అనుకున్న రావు రమేష్ గారితోనే వెళ్లిపోయాం’’ అని ప్రసన్న కుమార్ వెల్లడించాడు. చిరు స్థాయికి ఇది చిన్న కథ అనిపించేదేమో కానీ.. టీజర్లో రావు రమేష్ చేసిన పాత్రలో చిరును ఊహించుకుంటే ఆయన ఒక రేంజిలో వినోదం పండించేవారేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. నిజంగా చిరు చేసి ఉంటే సినిమా కథాకమామిషు మారిపోయేవేమో. ఆయనకు ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ తరహాలో మంచి ఎంటర్టైనర్ పడేదేమో.

Tags:    

Similar News