వారసుడికి హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్..?

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-02-27 03:15 GMT

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబో మూవీ ఈపాటికి సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఐతే తెల్లారితే పూజా కార్యక్రమాలు అనగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా కథ వరకు ఓకే కానీ డైరెక్షన్ నా వల్ల కాదని చేతులెత్తేసినట్టు టాక్. దీనిపై అసలు క్లారిటీ రావట్లేదు కానీ ప్రశాంత్ వర్మ మాత్రం తన సినిమా జై హనుమాన్ తో బిజీగా ఉండటం వల్ల దాదాపు కన్ ఫర్మ్ అనుకున్నారు.

ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ కాదనడానికి ప్రధాన రీజన్ ప్రభాస్ అని తెలుస్తుంది. అదెలా అంటే ప్రభాస్ కోసం ప్రశాంత్ వర్మ ఒక కథ లాక్ చేసుకోగా ఆ లైన్ బాగా రావడంతో ప్రభాస్ తో వెంటనే సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడట. సో ప్రశాంత్ వర్మ ప్రభాస్ సినిమా కోసమే మోక్షజ్ఞ సినిమా కాదనుకుంటున్నాడు అని అంటున్నారు. వీటిలో ఏది వాస్తవం అన్నది తెలియదు కానీ మోక్షజ్ఞ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ ఎగ్జిట్ అయినట్టు మాత్రం దాదాపు నిజమే అంటున్నారు.

నందమూరి వారసుడి మొదటి సినిమాకే ఇలా జరగడం ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. హనుమాన్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమా క్రేజ్ తో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఐతే అన్నీ ఒకేసారి చేస్తానని చెప్పి ప్రశాంత్ వర్మ రిస్క్ లో పడుతున్నాడని తెలుస్తుంది. ముందు కమిట్ మెంట్ ఇచ్చి ఆ తర్వాత తూచ్ అంటే అసలకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది. మరి ఈ విషయంలో ప్రశాంత్ వర్మ ఏం ఆలోచిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

మరోపక్క ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడప్పుడే అయ్యేది కాదు. ప్రభాస్ ఇప్పటికే ఐదారు సినిమాల దాకా చేయాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ సినిమా ఓకే అయినా అతని లైన్ వచ్చే సరికి చాలా టైం పడుతుంది. మరి ఈలోగా మోక్షజ్ఞ సినిమా పూర్తి చేసే ఛాన్స్ ఉన్నా ప్రశాంత్ వర్మ ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞతో అభిమన్యుడి కథ తెరకెక్కిస్తారంటూ వార్తలు రాగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేదని వస్తున్న వార్తలు నందమూరి ఫ్యాన్స్ కి హర్టింగ్ గా అనిపిస్తున్నాయి.

Tags:    

Similar News