డార్లింగ్ కోసం ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ లుక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ కూడా చేస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ కూడా చేస్తున్నాడు. ఉగాదికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ప్రభాస్ లైన్ లో ఉన్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్2తో పాటూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2ను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సలార్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్, ప్రభాస్ తో లాక్ చేసుకున్న మూడు సినిమాల్లో ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఒకటని, త్వరలోనే డార్లింగ్ ను ఈ టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ- ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మూవీ లుక్ టెస్ట్ లో ఉన్నట్టు వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వీక్ లోనే లుక్ టెస్ట్ పూర్తవుతుందని, ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ లుక్ ను కూడా డిజైన్ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు.
ఇక ప్రశాంత్ వర్మ విషయానికొస్తే, హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ అసలు ఏ సినిమా చేస్తాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. హనుమాన్ తర్వాత రణ్‌వీర్ సింగ్ తో ప్రాజెక్టు అన్నారు, కానీ అది క్యాన్సిల్ అయింది. దీంతో జై హనుమాన్ చేస్తాడన్నారు. కానీ రిషబ్ శెట్టి కాంతార2 తో బిజీగా ఉండటంతో గ్యాప్ వచ్చింది. మధ్యలో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ కూడా ప్రశాంత్ వర్మ చేతికే వచ్చింది. డిసెంబరులో మొదలవాల్సిన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోగా దాని గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ సినిమా అంటున్నారు. మరి వీటన్నింటిలో ప్రశాంత్ వర్మ ఏ సినిమాను ముందు పట్టాలెక్కిస్తాడో చూడాలి.