పాన్ ఇండియా సక్సెస్ తర్వాత డైరెక్టర్ గిజిబిజి!
`హనుమాన్` తో ప్రశాంత్ వర్మ తొలి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న సంగత తెలిసిందే. దీంతో ప్రశాంత్ వర్మ యూనివర్శ్ ని కూడా ప్రకటించాడు
`హనుమాన్` తో ప్రశాంత్ వర్మ తొలి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న సంగత తెలిసిందే. దీంతో ప్రశాంత్ వర్మ యూనివర్శ్ ని కూడా ప్రకటించాడు. తన యూనిర్శ్ నుంచి వివిధ సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. దీనిలో భాగంగానే రిషబ్ శెట్టితో `జై హనుమాన్` ప్రారంభించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ కి వెళ్లలేదు. రిషబ్ శెట్టి `కాంతార` ప్రీక్వెల్ షూటింగ్ ముగించి వచ్చే వరకూ సెట్స్ కి వెళ్లదు. ఇంకా `మహాకాళీ` చిత్రాన్ని మరో డైరెక్టర్ తో చేయిస్తున్నాడు.
అలాగే `అధీరా`,` బేడియా-2` చిత్రాలకు కూడా తానే దర్శకత్వం వహిస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఎంట్రీ బాధ్యతలు తనకిచ్చినట్లు ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ నుంచి చేజారిపోతుందనే ప్రచారం మరోవైపు జరుగుతుంది. ఇంతలో కాచీగూడలో తన సినిమా ఆఫీస్ పనుల్లో బిజీ అయినట్లు తేలింది. అక్కడ హాలీవుడ్ రేంజ్ లో ఆఫీస్ నిర్మించే పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే అప్పుడలా సినిమాలు ప్రకటించి..ఇప్పుడిలా ఆఫీస్ పనుల్లో నిమగ్నమవ్వడంతో? అసలు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడో? అర్దం కాని పరిస్థితి తలెత్తింది. చేతిలో అన్ని సినిమాలు పెట్టుకుని ఇంత బిజీలో ఆఫీస్ నిర్మాణం అనేది ఎన్నో రకాల సందేహాలకు తావిస్తోంది. హనుమాన్ రిలీజ్ అయి ఏడాది అయింది. ఇంతరకూ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ప్రకటించిన ప్రాజెక్ట్ లు ఎంత వరకూ వచ్చాయో తెలియదు.
ఇటీవలే ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన `దేవకీ నందన వాసుదేవ` కూడా ప్లాప్ అయింది. తొలి అరగంటలోనే ఈ సినిమా కథాగమనం అర్దమైపోయింది. ఏదో సినిమా అలా వెళ్తుంది తప్ప ఎక్కడా ఎగ్జైట్ మెంట్ తీసుకురాదు. అయితే ఈ వైఫల్యం ప్రశాంత్ వర్మని డైలమాలో పడేసిందా? అన్నది కొందరి సందేహం. తాను రాసిన తాజా కథలకు మళ్లీ ఏవైనా రిపేర్లు చేస్తున్నాడా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.