తార‌క్ పై అభిమానంతో దిగాడు..మాట‌ల్లేవ్!

అభిమానులే ద‌ర్శ‌కులుగా మారి త‌న అభిమాన స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

Update: 2024-10-26 15:30 GMT

అభిమానులే ద‌ర్శ‌కులుగా మారి త‌న అభిమాన స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలా కిక్ ని ఆస్వా దించిన డైరెక్ట‌ర్లు ఎంతో మంది. చిరంజీవిని బాబి ఇలా అభిమానించే `వాల్తేరు వీర‌య్య` అనే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. బోయ‌పాటి శ్రీను న‌ట‌సింహ బాల‌కృష్ణ‌ను ఇలా అభిమానించే బాల‌య్య‌లో కొత్త యాంగిల్ ని త‌ట్టి లేపాడు. అత‌డి కెరీర్ నే మార్చేసాడు. ఇప్పుడా ద్వ‌యం ఏకంగా డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసింది.

ఓ డైహార్డ్ అభిమాని డైరెక్ట‌ర్ గా మారితే అలాంటి సంచ‌ల‌నాలు న‌మోద‌వుతాయి. మ‌చ్చుకు వీరిద్ద‌రే కాదు. ఇంకా చాలా మంది అభిమానులు డైరెక్ట‌ర్ల‌గా మారి త‌మ అభిమాన హీరోల‌తో ప‌నిచేసారు. ఇప్పుడు పాన్ ఇండియా సంచ‌ల‌నం ప్ర‌శాంత్ నీల్..త‌న అభిమాన హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `కేజీఎఫ్` తో య‌శ్ ని పాన్ ఇండియాస్టార్ చేసాడు. ఆ త‌ర్వాత ప్లాప్ ల్లో ఉన్న మ‌రో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రేంజ్ ని `స‌లార్` తో అంత‌కంత‌కు పెంచేసాడు.

డార్లింగ్ లో మ్యాన్లీ లుక్ ని పాన్ ఇండియాకి ప‌నిచ‌యం చేసిన ఘ‌న‌త నీల్ దే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు సినిమాలు వాళ్ల‌పై అభిమానంతో చేసిన‌వి కాదు. సినిమా అనే ప్రోసస్ లో జ‌రిగిపోయాయి. ఇప్పుడు త‌న అభిమాన హీరో తార‌క్ ని డైరెక్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ప్ర‌భాస్, య‌శ్ నే ఆ రేంజ్ లో డైరెక్ట్ చేసాడంటే? అభిమాన తార‌క్ ని ఇంకే రేంజ్ లో చూపిస్తాడో ఊహ‌కి కూడా అంద‌దు అన్న‌ది అభిమానుల మాటే కాదు.

నీల్ వ‌ద్ద రైట‌ర్ల‌గా ప‌నిచేసిన వారు ఈ మాట ఘంటాప‌ధంగా చెబుతున్నారు. తార‌క్ ని ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ లో చూపించ‌బోతున్నాడ‌న్నారు. నీల్ వ‌ద్ద ప‌నిచేసిన తాము సైతం అత‌డిని ఎలా చూపిస్తాడు అనే ఒక‌టే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నామంటున్నారు. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ కి వెళ్తుంద‌ని? టైటిల్ ఎలా ఉంటుంది? తార‌క్ లుక్ ఎలా ఉంటుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇలా త‌మ అంద‌రిలో ఓ కామ‌న్ ఆడియ‌న్ లా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నామ‌న్నారు.

Tags:    

Similar News