'దేవ‌ర' లెక్క ప్ర‌శాంత్ నీల్ స‌రి చేస్తాడా?

`ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో? రాజ‌మౌళి ఏ రేంజ్ లో ఆవిష్క‌రించాడో చెప్పా ల్సిన ప‌నిలేదు.

Update: 2025-01-26 21:30 GMT

`ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో? రాజ‌మౌళి ఏ రేంజ్ లో ఆవిష్క‌రించాడో చెప్పా ల్సిన ప‌నిలేదు. అందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌తో స‌రిపోల్చితే కాస్త భీమ్ రోల్ వీక్ గా ఉన్నా? తార‌క్ ని తెర‌పై చూపించినంత సేపు ఓ హై తీసుకు రాగ‌లిగాడు జ‌క్క‌న్న‌. చ‌ర‌ణ్- తార‌క్ ఎంట్రీ బ్రిడ్జి స‌న్నివేశం గానీ, బ్రిటీష్ సామ్రాజ్యంలోకి అడ‌వి మృగాల‌తో తార‌క్ దాడి చేసే స‌న్నివేశాలు గానీ తార‌క్ ఇమేజ్ ని అమాతం రెట్టింపె చేసిన స‌న్నివేశాలే అవ‌న్నీ.

క్లైమాక్స్ లో అదే తార‌క్ ని కాస్త వీక్ గా చూపించ‌డంతో? థియేట‌ర్లో కుర్చీలు విరిగిన సంగ‌తి తెలిసిందే. అలాంటి తార‌క్ ని `దేవ‌ర‌`లో కొర‌టాల శివ ఆవిష్క‌రించిన తీరు మాత్రం కొంత నిరుత్సాహ ప‌రిచింది. సినిమాకి డివైడ్ టాక్ రావ‌డానికి ఇదీ ఓ కార‌ణం. సినిమా కాన్సెప్ట్ ప‌క్క‌న‌బెడితే? తార‌క్ లో హై ఓల్టేజ్ ఎన‌ర్జీని కొర‌టాల స‌రిగ్గా ఎగ్జిక్యూట్ చేయ‌లే క‌పోయాడు? అన్న విమ‌ర్శ తెర‌పైకి వ‌చ్చింది. హీరో ఎలివేష‌న్ స‌న్నివేశాలు ఏమాత్రం హై తీసుకు రాలేక‌పోయాయి అన్న‌ది వాస్త‌వం.

ఓ సాధార‌ణ సినిమా లాగే అనిపించింది. అయితే ఇప్పుడా లెక్క‌ల‌న్నింటిని ప్ర‌శాంత్ నీల్ స‌రిచేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ `డ్రాగ‌న్` అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ గ‌త చిత్రాలు `కేజీఎఫ్` లో య‌శ్ రోల్, `స‌లార్` లో ప్ర‌భాస్ ని ఏ రేంజ్ లో చూపించాడో తెలిసిందే. ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్నే చూపించి హీరో పాత్ర‌ల‌ను నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లాడు. బ‌ల‌మైన క‌థా నేప‌థ్యంతో పాటు పాత్ర‌ల్ని కూడా అంతే బ‌లంగా రాసుకుని హీరో పాత్ర‌ని మ‌రింత హైలో తీర్చిది ద్ద‌డంలో? ప్ర‌శాంత్ నీల్ రాజ‌మౌళి క‌న్నా రెండు ఆకులు ఎక్కువే చ‌దివాడు అన్న ప్ర‌శంస అందుకున్నాడు.

ఇప్పుడు తార‌క్ ని కూడా అదే రేంజ్ లో చూపిస్తాడు? అన్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌శాంత్ నీల్ స్టోరీ నేప‌థ్యాన్ని ఎలాంటిది తీసుకున్నా హీరో పాత్ర‌ని మాత్రం సాలిడ్ గానే చూపిస్తాడు. విజువ‌ల్ గా హీరో పాత్ర ఎంతో ఎగ్జైట్ మెంట్ తోనే సాగుతుంద‌ని భావిస్తున్నారు. మయన్మార్ -భూటాన్ నేప‌థ్యంలో సాగే స్టోరీ అని ప్ర‌చారంలో ఉంది. ఆ నేపథ్యాన్ని బేస్ చేసుకుని తార‌క్ రోల్ డిజైన్ చేసి ఉంటాడ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News