నీల్ - ఎన్టీఆర్ - అసలు ప్లాన్ ఏమిటంటే..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న మూవీ ప్రారంభోత్సవం ఇటీవల పూజా కార్యక్రమాలతో హైలెట్ అయిన విషయం తెలిసిందే.

Update: 2024-10-19 09:30 GMT

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న మూవీ ప్రారంభోత్సవం ఇటీవల పూజా కార్యక్రమాలతో హైలెట్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ మొన్నటి వరకు ఈ సినిమా కోసం వినిపించింది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ తో తమిళ్ మూవీ స్టార్ట్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ మరో పవర్ ఫుల్ టైటిల్ ని వెతకాల్సిన అవసరం వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఇప్పుడు నవంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూట్ స్టార్ట్ చేస్తాడంట. వచ్చే ఏడాది తారక్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది.

‘దేవర’ మూవీ సక్సెస్ తో జోష్ లో ఉన్న ఎన్టీఆర్ హిందీలో చేస్తోన్న ‘వార్ 2’ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ‘దేవర’ మూవీ సక్సెస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ నెక్స్ట్ ‘వార్ 2’ షూటింగ్ కోసం వెళ్లనున్నట్లు చెప్పారు. హృతిక్ రోషన్, తారక్ మధ్య కీలకమైన యాక్షన్ సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ‘వార్ 2’ కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు.

ఈ మూవీ 2026 జనవరిలో రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ప్రశాంత్ నీల్ మూవీ ఫినిష్ చేయడంపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ ఏడాది చివరలో షూటింగ్ స్టార్ట్ కావచ్చని తెలుస్తోంది. ఇక కేవలం 8 నెలల టార్గెట్ తో సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తో మూవీ కంప్లీట్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర 2’ పైన దృష్టి పెట్టనున్నారు. ఈ లోపు కొరటాల శివ ‘దేవర పార్ట్ 2’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ కూడా తారక్ తో చేస్తోన్న సినిమా తర్వాత ‘సలార్ 2’ పైన ఫోకస్ చేస్తాడంట. ఈ లోపు ప్రభాస్ కూడా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కొన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. ‘సలార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ స్టార్ట్ చేయొచ్చని అనుకుంటున్నారు. దాని తర్వాత రామ్ చరణ్ తో సినిమా ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది.

Tags:    

Similar News