ప్రశాంత్ వర్మ అడుగులు తడబడుతున్నాయే!
ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్‌లో భాగంగా స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్ తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా ఓ సూపర్‌మెన్ సినిమాని ప్లాన్ చేశాడు.;

షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా, రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నేచురల్‌స్టార్ నాని నిర్మించిన 'అ!' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కల్కీ, జాంబిరెడ్డి చిత్రాలు చేశారు. అయితే తేజ సజ్జతో చేసిన పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' దర్శకుడిగా భారీ క్రేజ్‌ని తెచ్చిపెట్టి స్టార్ డైరెక్టర్‌ల జాబితాలో చేర్చింది. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ స్ఫూర్తితో రూ.40 కోట్ల బడ్జెట్‌తో చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైనే రాబట్టి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది.
ఊహించని విధంగా 'హనుమాన్' వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో ఒక్కసారిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. దీంతో ఆయనపై ఆఫర్ల వెల్లువెత్తాయి. టాలీవుడ్ దిగ్గజ హీరోల నుంచి బాలీవుడ్ క్రేజీ స్టార్ల వరకు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించారు. కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ప్రశాంత్ వర్మ తలుపుతట్టాయి. అయితే అంతే వేగంగా ఆ అవకాశాలన్నీ చేజారడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రకటించిన ఏ ప్రాజెక్ట్ ముందుకెళ్లడం లేదు.. కారణమేంటీ? అనే చర్చ జరుగుతోంది. హనుమాన్ తరువాత బాలీవుడ్ హైపర్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఓ భారీ సినిమా చేసే ఆఫర్ వచ్చింది. అయితే ఇది సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. దీనికి కారణం ప్రశాంత్ వర్మకు, హీరో రణ్‌వీర్ సింగ్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమేనని తెలిసింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్‌లో భాగంగా స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్ తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా ఓ సూపర్‌మెన్ సినిమాని ప్లాన్ చేశాడు.
కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయిన ఈ మూవీని అర్థాంతరంగా నిలిపేశారు. ఇక నందమూరి బాలకృష్ణ నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజను హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ సినిమా చేసే అవకాశం ప్రశాంత్ వర్మ చేతికొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ని గత ఏడాది ప్రకటించారు. ఇంత వరకు దీనికి సంబంధించిన అప్‌డేట్ లేదు. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతిలో ఉన్న సినిమా ఒక్కటే అదే 'జై హనుమాన్'. దర్శకుడిగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ ఒకే సమయంలో మల్టీపుల్ ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరి 'జై హనుమాన్'ని అయినా అనుకున్న టైమ్‌కు, అనుకున్న స్థాయిలో తెరపైకి తెస్తాడా అనే చర్చ ప్రస్తుతం ఇడస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.