PVCU 3: కీలక అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 10న PVCU 3 పైన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఉండబోతోందని కన్ఫర్మ్ చేశారు.
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఎవ్వరి అంచనాలకి అందకుండా దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై హీరోలు, మేకర్స్ దృష్టి పడింది.
తాను క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో ఏకంగా 10 సూపర్ హీరో చిత్రాలని తెరకెక్కిస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. PVCU లో ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీని ప్రకటించాడు. కళ్యాణ్ దాసరి హీరోగా ‘అధీరా’ అనే సినిమాని గతంలో ఎనౌన్స్ చేశారు. మోషన్ పోస్టర్ తో ఈ మూవీపైన ప్రకటన చేశారు. ‘అధీరా’ ప్రకటించి చాలా కాలం అయ్యింది. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో నందమూరి మోక్షజ్ఞ హీరోగా మూవీ ఎనౌన్స్ చేశారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 10న PVCU 3 పైన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఉండబోతోందని కన్ఫర్మ్ చేశారు. నవరాత్రి సందర్భంగా పవర్ అండ్ మ్యాజిక్ ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. రాబోయే అప్డేట్ కోసం మీరు నాలాగే ఉత్సాహంగా ఉన్నారని భావిస్తున్నాను అంటూ ప్రశాంత్ వర్మ పోస్ట్ పెట్టారు.
చిన్న షార్ట్ వీడియో కూడా ఆ ట్వీట్ తో పాటు షేర్ చేశారు. కళ్యాణ్ దాసరి హీరోగా తెరకెక్కుతోన్న ‘అధీరా’ గురించి ఈ అప్డేట్ ఉండబోతుందా, లేదంటే ‘జై హనుమాన్’ పైన ఉంటుందా అనేది క్లారిటీ లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే జై హనుమాన్ అప్డేట్ అని అర్ధమవుతుంది. ఈ రెండింటిలో ఒకటి కచ్చితంగా PVCU 3 అవుతుందని అనుకుంటున్నారు. అయితే ప్రశాంత్ వర్మ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పష్టత రాదు.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ‘జై హనుమాన్’ తో పాటు కళ్యాణ్ దాసరి ‘అధీరా’, మోక్షజ్ఞ డెబ్యూ మూవీస్ ఉన్నాయి. అయితే ప్రశాంత్ వర్మ ప్రకటన మోక్షజ్ఞ సినిమా అప్డేట్ గురించి కాకపోవచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సూపర్ హీరో చిత్రాలపై ఇప్పుడు తెలుగునాట మంచి ఆసక్తి నెలకొని ఉందని చెప్పొచ్చు.