యంగ్ టైగర్ తో కూడా నీల్ అదే సెంటిమెంట్!
భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి? అన్నది ఇంత వరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు.
ప్రశాంత్ నీల్ ఎంత పెద్ద భారీ స్పాన్ సినిమా తీసినా? దాని వెనుక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్ సెంటి మెంట్ తోనే? అతడు ఆ తర్వాత స్టోరీ బ్యాక్ డ్రాప్ అల్లుతాడు. కేజీఎఫ్...సలార్ రెండు మదర్ సెంటిమెంట్ ఆధారంగా తీసిన చిత్రాలే. ఆ సెంటిమెంట్ కి తనదైన మార్క్ క్రియేటివిటీతో భారీ స్పాన్ ఉన్న కథగా తీర్చి దిద్దాడు. ఇది అతడి స్పెషాల్టీ. కొన్ని లాజిక్కులు పక్కన బెడితే మదర్ సెంటిమెంట్ లో అతడు అద్భుతమైన ఎమోషన్ పండించగలడు.
పైగా మదర్ సెంటిమెంట్ అంటే? కామన్ మ్యాన్ సైతం ఈజీగా ఆ కథకి కనెక్ట్ అవ్వగలడు. ఆ విషయంలో నీల్ సక్సెస్ అయ్యాడు. తాజాగా 'బఘీరా' అనే సినిమాకి కూడా ప్రశాంత్ నీల్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఆ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే ఇదీ మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని రాసిన కథగా తెలు స్తోంది. దానికే నీల్ మార్క్ మేకింగ్ ని జోడించి సదరు దర్శకుడు తీసినట్లు కనిపిస్తుంది.
ముందు మదర్ సెంటిమెంట్ తో మొదలవుతుంది. ఆ తర్వాత కథ మరో కోణంలో పీక్స్ తీసుకెళ్లడం అతడి కథల్లో స్పెషాల్టీ. మరి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి? అన్నది ఇంత వరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు.
మరి ఈ కథ కూడా మదర్ సెంటిమెంట్ తోనే ప్రారంభం అవుతుందా? లేక కొత్త పాయింట్ ఏదైనా ఎత్తుకున్నాడా? అన్నది సస్పెన్స్. బయట సినిమాలకు కథలు అందించినా తల్లి సెంటిమెంట్ జోడిస్తున్న నేపథ్యంలో? తారక్ కోసం రాసిన కథ కూడా అలాంటిదే? అయి ఉంటుందని మెజార్టీ వర్గం అంచనా వేస్తోంది. మరి ఆ సంగతేంటి? అన్నది తేలాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీతో నీల్ కి క్లోజ్ అసోసిషన్ ఉంది. అతడి కంటే? నీల్ భార్యకి మరింత మంచి రిలేషన్ కనిపిస్తుంది. మరి ఆ కోణంలో ఏదైనా సెంటిమెంట్ ని తీసుకునే ఛాన్స్ లేకపో లేదు.