రాజమౌళి, సుక్కు.. కానీ నీల్ ఎందుకిలా?

ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

Update: 2024-08-11 04:12 GMT

ఈ మధ్యకాలంలో సినిమాలని సిరీస్ లుగా చేయడం ట్రెండ్ గా మారింది. బాహుబలి సినిమాని రాజమౌళి రెండు పార్ట్స్ గా తెరకెక్కించారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో దానికి సీక్వెల్ కూడా చేసి సెన్సేషన్ సక్సెస్ ని అందుకున్నారు. రాజమౌళి ఈ రెండు సినిమాలని వెంట వెంటనే చేసేశారు. అస్సలు గ్యాప్ తీసుకోలేదు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగానే తెరకెక్కించారు. వీటిని ఆయన వెంటవెంటనే కంప్లీట్ చేశారు.

ఇప్పుడు సుకుమార్ కూడా పుష్ప విషయంలో అదే చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పుష్ప ది రూల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. పుష్ప 3 ఉంటుందని చెప్పిన కూడా దానని లాంగ్ గ్యాప్ తీసుకొని చేయాలని అనుకుంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ లో రెండు భాగాలు బ్యాక్ టూ బ్యాక్ కంప్లీట్ చేశారు.

మధ్యలో వేరే సినిమాలకి కమిట్ కాలేదు. అయితే సలార్ విషయంలో మాత్రం ఎందుకనో ప్రశాంత్ నీల్ కాస్తా వెనకడుగు వేశారు. సలార్ పార్ట్ 1 గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. 2025 ఎండింగ్ లో సలార్ పార్ట్ 2 వచ్చేస్తుందని అందరూ భావించారు. నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఎందుకనో సలార్ 2 మూవీని ప్రశాంత్ నీల్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళలేదు.

దానిని హోల్డ్ లో పెట్టి ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ చిత్రం 2026 జనవరికి రిలీజ్ అవుతుందని డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అంత వరకు సలార్ 2 చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం లేదా అంటే ఎలాంటి క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సలార్ 2 సినిమా కచ్చితంగా స్టార్ట్ అవుతుందని నిర్మాత పలు సందర్భంగా ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అందులో నటించిన యాక్టర్స్ కూడా చెప్పారు.

అయితే ప్రశాంత్ నీల్ సైలెన్స్ వెనుక అర్ధం ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ప్రశాంత్ నీల్ కంటే ముందుగా డైరెక్టర్ శంకర్ రోబో సీక్వెల్ కి ఇలాగే గ్యాప్ తీసుకున్నారు. అయితే అది కొనసాగింపుగా వచ్చిన కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కింది. కానీ సలార్ 2లో మొదటి పార్ట్ లో ప్రశ్నలుగా వదిలేసిన వాటికి సమాధానంగా కథని చెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందనేది ఎవరికి అర్ధం కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News