మాటలున్నంత పదునుగా సినిమాలుండవంటే ఒప్పుకోను!
గాండీవదారి అర్జున గురించి మాట్లాడుతూ..' లండన్ లో ఓ వారం రోజుల్లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే సమ్మిట్ కి ఇండియా తరుపును నాజర్ హాజరవుతారు.
'ఎల్బీడబ్ల్యూ' తో దర్శకుడిగా పరిచయమైన ప్రవీణ్ సత్తారు సుపరిచితమే. అటుపై 'రొటీన్ లవ్ స్టోరీ'..'చందమామ కథలు'.. 'గుంటూరు టాకీస్'.. 'పీఎస్ వీ.గరుడు'.. 'ఘోస్ట్' చిత్రాలు తెరకెక్కించారు. వీటిలో కొన్ని యావరేజ్ గా ఆడగా..మరికొన్ని ఆశించిన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గాండీవధారి అర్జున అనే డిఫరెంట్ సినిమా చేసాడు. ఈసినిమా రిలీజ్ సందర్భంగా ప్రవీణ్ ప్రచారం లో భాగంగా ఎదురైన ప్రశ్నలకు అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు.
మాటలు ఉన్నంత పదునుగా సినిమాలుండవ్ అనే ప్రశ్న నేరుగా ఆయన ముందుకు వెళ్లింది. దీంతో ఆయన ఆ కామెంట్ ని యాక్సప్ట్ చేయలేదు. మాటలు లాగే తన సినిమాలుంటాయని చెప్పకనే చెప్పాడు. 'గరుడ వేగ' కంటే, 'గుంటూరు టాకీస్' పెద్ద హిట్ సాధించిందన్నారు. గాండీవదారి అర్జున గురించి మాట్లాడుతూ..' లండన్ లో ఓ వారం రోజుల్లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే సమ్మిట్ కి ఇండియా తరుపును నాజర్ హాజరవుతారు.
ఆయన సెక్యూరిటీగా ఓ ఏజెన్సీ నుంచి బాడీ గార్డ్ గా హీరో వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందన్నదే కథ. ఇది మెయిన్ స్టోరీ. ఆ తర్వాత చాలా లేయర్స్ వస్తుంటాయి. సినిమా ఎక్కడ తీసాం అనేది పట్టించుకోరు ప్రేక్షకులు. స్టోరీ మాత్రమే ఫాలో అవుతుంటారు.
సినిమాలో వచ్చే ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతుంటారు. నేను యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలను అనేది నిజం కాదు. గుంటూరు టాకీస్ లాంటి లవ్ స్టోరీలు చేయగలని నిరూపించను' అని అన్నారు.
ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి. ప్రవీణ్ సత్తారు నాగార్జున తర్వాత డైరెక్ట్ చేసిన స్టార్ హీరో వరుణ్ తేజ్. ఈ కథలో కొన్ని అంశాలకు వరుణ కనెక్ట్ అవ్వడంతోనే సినిమా చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై వరుణ్-ప్రవీణ్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఫలితం తేలిపోతుంది.