కొత్త ఏడాదిలో అన్నీ శుభ‌వార్త‌లేనా?

హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి...త‌ల్లి అయితే ఇంకా క్రేజ్ ఉంటుందన్న‌ది నేటి రూల్ గా మారింది.;

Update: 2025-03-02 07:05 GMT

హీరోయిన్ గా రాణించాలంటే పెళ్లి చేసుకోకూడ‌దు...త‌ల్లి కాకూడ‌దు అన్న‌ది నాటి రూల్. నేడు రూల్ ఆ పాత రూల్ కి పూర్తి కాంట్రెస్ట్. హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి...త‌ల్లి అయితే ఇంకా క్రేజ్ ఉంటుందన్న‌ది నేటి రూల్ గా మారింది. త‌ల్లులైన అంద‌మైన బాలీవుడ్ భామ‌లంతా న‌టీమ‌ణులు ఎంత బిజీగా ఉన్నారు అన్న‌ది చెప్పాల్సిన పనిలేదు. దీపికా ప‌దుకొణే, క‌రీనా క‌పూర్ , అనుష్క శ‌ర్మ‌, అలియాభ‌ట్ లు కొంద‌రైతే అద్దె గ‌ర్బం ద్వారా త‌ల్లులైన వారు మరికొంత మంది .

న‌య‌న‌తార‌, ప్రియాంక చోప్రా ఇలా కొంత మంది ఉన్నారు. వీరంతా ప్రోఫెష‌న‌ల్ గా ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి..త‌ల్లి అనే బంధంతో సంబంధం లేకుండా న‌టీమ‌ణులుగా కొన‌సాగుతున్నారు. ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక పారితోషికం కూడా అందుకుంటున్నారు. త్వ‌ర‌లో మ‌రికొంత మంది కూడా త‌ల్లులు కాబోతున్నారు. వారంతా ఇప్ప‌టికే గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు.

నిన్న‌టి రోజున కియారా అద్వాణీ గ‌ర్భందాల్చిన విష‌యాన్ని రివీల్ చేసింది. భ‌ర్త సిద్దార్ధ్ మ‌ల్హోత్రాతో క‌లిసి విష‌యాన్ని పంచుకుంది. న‌టిగా ఇప్ప‌టికే బిజీగా ఉంది. ఇక‌పై కియారా మ‌రింత బిజీగా మారుతుంది. ప్ర‌స్తుతం టాక్సిక్, వార్ 2 చిత్రాల్లో కియారా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే సునీల్ శెట్టి కుమార్తె అతియాశెట్టి కూడా గ‌ర్భంతో ఉంది. ఇదే ఏడాది తల్లిగా పిలుపు అందుకోబోతుంది.

అలాగే ఇలియానా, అమీజాక‌న్స్ కూడా త‌మ ప్రెగ్నెన్సీ వార్త‌ను ఇప్ప‌టికే క‌న్ప‌మ్ చేసారు. ఇద్ద‌రు సెకెండ్ చైల్డ్ కి రెడీ అవుతున్నారు. క‌త్రినా కైఫ్ కూడా శుభ‌వార్త చెబుతుంద‌ని అంతా ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె గ‌ర్భ‌వ‌తి అని ప‌లుమార్లు మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా మీడియాకు ఇలాంటి విష‌యాలు వెల్ల‌డించకుండా గోప్య‌త వ‌హించే వారు మ‌రికొంత మంది ఉన్నారు.

Tags:    

Similar News