పిలిచి పెద్ద ఆఫర్‌ చేసినా నో చెప్పా..!

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రీతి జింటా. ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది.;

Update: 2025-02-28 13:30 GMT

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు ప్రీతి జింటా. ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమె నటించిన సినిమాలు కొన్ని అయినా మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో ప్రీతి జింటా వరుసగా ఆఫర్లు వచ్చినా బాలీవుడ్‌కి పరిమితం అయింది. టాలీవుడ్‌లో పరిమిత సినిమాలు చేసినా ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది. గత కొన్నాళ్లుగా ప్రీతి జింటా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో సందడి చేస్తున్న ప్రీతి జింటా సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తాజాగా సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడింది.

ఆర్మీ ఫ్యామిలీ పుట్టిన నువ్వు కూడా ఇండియన్‌ ఆర్మీకి చెందిన వ్యక్తివే. నీవు చాలా క్రమశిక్షణతో నడుచుకుంటూ ఉంటారు, అలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాను. మీకు రాజకీయాల్లో చేరే ఆలోచన ఉందా.. ఒకవేళ రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఏ పార్టీలో చేరుతారు అంటూ ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ప్రీతి జింటా స్పందిస్తూ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది. గతంలో చాలా సార్లు ప్రముఖ పార్టీలు నాకు పిలిచి పెద్ద పెద్ద ఆఫర్లను ఇచ్చాయి. చాలా వరకు నేను నో చెప్పాను. పెద్ద ఆఫర్‌లు ఇచ్చిన పార్టీలను సున్నితంగా తిరస్కరించాను. ఒక పార్టీ ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధం అయింది. కానీ నేను నో చెప్పాను.

రాజకీయాల్లో అడుగు పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరష్కరించాను. నా తండ్రి ఆర్మీ ఆఫీసర్‌, నా సోదరుడు ఆర్మీ ఆఫీసర్‌. నా ఫ్యామిలీలో చాలా మందికి ఇండియన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి. కనుక నేను కూడా ఇండియన్‌ ఆర్మీలో ఉన్నట్లుగా భావిస్తాను. నార్త్‌ ఇండియన్‌, సౌత్‌ ఇండియన్ కాకుండా నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను అంటూ ప్రీతి జింటా చెప్పుకొచ్చింది. మా ఫ్యామిలీ మొత్తంకు దేశ భక్తి ఉంటుంది, నా ఫ్యామిలీ మొత్తం జాతికి గర్వ కారణంగా నిలిచేందుకు పాటు పడుతామని పేర్కొంది. దేశ భక్తి, జాతి గౌరవం అనేది మా రక్తంలో ఉందని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.

తనకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేకున్నా కొందరు సోషల్‌ మీడియాలో తాను చేసే పోస్ట్‌లకు కామెంట్స్ చేస్తూ ఉంటారు, రాజకీయాలను అంటగట్టేందుకు చూస్తూ ఉంటారు. రాజకీయంగా ఒక వర్గం వారు తనను పదే పదే కామెంట్‌ చేస్తూ, విమర్శలు చేస్తూ ఉంటారు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా వ్యక్తిగత లైఫ్‌కి ఆ కామెంట్స్ పెద్దగా సమస్య కాదు అని భావిస్తాను. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పడంలో ఇబ్బంది లేదు, కానీ ఇతరుల అభిప్రాయాలతో పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ప్రీతి జింటా పేర్కొంది. భవిష్యత్తులోనూ తాను రాజకీయాల జోలికి వెళ్లను అని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News