బిగ్ బాస్ 8 : డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు..?

ఇక ఎటొచ్చి ప్రేరణ, యష్మి, పృధ్విల మధ్యనే ఎలిమినేషన్ ఫైట్ జరుగుతుంది. ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది.

Update: 2024-11-21 06:04 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో 12వ వారం వెరైటీ నామినేషన్స్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో ఈ వారం నామినేషన్స్ చేయించాడు. హౌస్ లోకి బేబక్క, సోనియా, శేఖర్ భాషా, నైనిక, సీత, మణికంఠ, ఆదిత్య రామ్ లు హౌస్ లోకి వచ్చి తమ నామినేషన్స్ వేసి వెళ్లారు. ఈసారి నామినేషన్స్ లో యష్మి, ప్రేరణ, నబీల్, నిఖిల్, పృధ్వి ఈ ఐదుగురు మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఈ ఐదుగురు వారి ఆటతో మెప్పిస్తున్నారు.

ముఖ్యంగా యష్మి, నిఖిల్, ప్రేరణల మీద గ్రూప్ గేమ్ అన్న ట్యాగ్ ఉంది. వాళ్లు ఎంత చెప్పినా సరే ఎక్కడో ఒకచోట వాళ్లు కలిసి ఆడుతున్నారు అన్నట్టుగా ఆడియన్స్ కు ప్రొజెక్ట్ అవుతుంది. దీన్ని హైలెట్ చేస్తూనే గౌతం టైటిల్ రేసుకి నిఖిల్ కు దగ్గరగా వచ్చాడు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో నిఖిల్, నబీల్ లకు ఎలాంటి రిస్కు లేదు. వారిద్దరు మంచి ఓటింగ్ తోనే దూసుకెళ్తున్నారు.

ఇక ఎటొచ్చి ప్రేరణ, యష్మి, పృధ్విల మధ్యనే ఎలిమినేషన్ ఫైట్ జరుగుతుంది. ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా పృధ్వి, యష్మి ఇద్దరు రిస్క్ లో ఉన్నారు. వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ వీరిద్దరు కాకపోతే ప్రేరణ కూడా రిస్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రేరణ ఆట బాగానే ఆడుతుంది కానీ అవతల వ్యక్తిని దూషించడంలో కాస్త నెగిటివిటీ తెచ్చుకుంది.

ప్రేరణ మొన్నటిదాకా టాప్ 5కి పక్కా అని అనుకున్నారు కానీ కొన్ని విషయాల్లో ఆమె ప్రవర్తన హౌస్ మెట్స్ కు మాత్రమే కాదు ఆడియన్స్ కి షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ కారణాల వల్లే ఆమె డేంజర్ జోన్ లో ఉంది. ఇక పృధ్వి విషయానికి వస్తే కేవలం టాస్కులు తప్ప అతను హౌస్ లో ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు ఒకరిద్దరితో మాత్రమే అతను క్లోజ్ గా ఉంటున్నాడు అన్న టాక్ ఉంది.

ఇక యష్మి విషయానికి వస్తే మొదట్లో చాలా ఫైర్ తో ఆడిన ఆమె ఆ తర్వాత నిఖిల్ తో ఉంటూ సైడ్ ట్రాక్ వెళ్లింది. ఐతే ఈ వారం ఎక్కువ రిస్క్ ఉన్నది యష్మికే అని తెలుస్తుంది. మరి ఆడియన్స్ ఓటింగ్ ఎవరిని సేఫ్ చేసి ఎవరిని బయటకు వెళ్లేలా చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News