తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాలివే
చాలా కాలంగా టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల ప్రభావం ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారు
చాలా కాలంగా టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల ప్రభావం ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారు. వారికి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తీ, విజయ్, అజిత్, విశాల్ లాంటి తమిళ్ హీరోలకి తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. వారి సినిమాలు తమిళంలో కంటే తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.
కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ యష్, కొత్తగా రిషబ్ శెట్టి టాలీవుడ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. గత కొన్నేళ్ల నుంచి సౌత్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో రేంజ్ బట్టి ఆ సినిమాలకి తెలుగులో మంచి బిజినెస్ జరుగుతోంది. ఇలా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి అత్యధిక బిజినెస్ జరిగిన సినిమాల జాబితాలో చూసుకుంటే టాప్ లో రాకింగ్ స్టార్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఉంది.
ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో 78 కోట్ల బిజినెస్ జరిగింది. అదే స్థాయిలో కలెక్షన్స్ ని కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 వసూళ్లు చేసింది. ఆ తరువాత హైయెస్ట్ బిజినెస్ చేసిన మూవీ అంటే శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ. ఈ చిత్రం 71 కోట్ల బిజినెస్ ని తెలుగు రాష్ట్రాలలో చేసింది. తరువాత స్థానంలో 39 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో చియాన్ విక్రమ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఐ మూవీ ఉంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కాలా మూవీ 33 కోట్ల బిజినెస్ తో నాలుగో స్థానంలో ఉండగా వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కబాలి పైన 31 కోట్ల ప్రీరిలీజ్ వ్యాపారం అయ్యింది. ఇక రోబో మూవీ 27 కోట్ల వ్యాపారంతో ఆరో స్థానంలో నిలిచింది. దీని తర్వాత ప్లేస్ లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న భారతీయుడు 2 ఉంది. ఈ సినిమాపై 25 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో జరిగింది.
నెక్స్ట్ ప్లేస్ లో సూర్యం సింగం3 మూవీ 20 కోట్ల బిజినెస్ తో నిలిచింది. తెలుగులో హైయెస్ట్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఎవర్ గ్రీన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నాడని చెప్పొచ్చు. ఆయన సినిమాలన్నీ కూడా 20+ కోట్లకి పైనే తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ చేస్తాయి. కమల్ హాసన్ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. భారతీయుడు 2 బిజినెస్ పరంగా చాలా తక్కువగా బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. అందుకే ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కేజీఎఫ్ చాప్టర్ 2 - 78CR
2.ఓ - 71Cr
ఐ - 39Cr
కాలా - 33Cr
కబాలి - 31Cr
రోబో - 27Cr~
భారతీయుడు 2 - 24Cr
సింగం3 - 20Cr