ప్రీ రిలీజ్ సినిమా రేంజ్ ని తగ్గిస్తుందా?
నేరుగా రిలీజ్ తేది ప్రకటించింది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అవి భారీ ఓపెనింగ్స్ తో పాటు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించాయి
సినిమా రేంజ్ ని ప్రీ రిలీజ్ తగ్గిస్తుందా? మార్కెట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ మైనస్ అవుతుందా? ఇలా ఈవెంట్ చేయడం ఆర్బాటంగా కనిపిస్తుందా? అంటే అవుననే కొత్త టాక్ మొదలైంది. ఒకప్పుడు భారీ ఎత్తున ఆడియో వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగేది. ఆ తర్వాత ట్రెండ్ మారింది. గత దశాబ్ధానికి పైగా ఆడియో వేడుక స్థానంలో ప్రీ రీలీజ్ ఈవెంట్ అంతూ కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఆడియోని మార్కెట్ లోకి ముందే సింగిల్స్ రూపంలో తీసుకురావడంతో మ్యూజికల్ సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది.
అందుకే ఆడియో వేడుకని తీసేసి ఆస్థానంలో ప్రీ రిలీజ్ తెచ్చారు. సినిమా రిలీజ్ కి సరిగ్గా రెండు...మూడు..నాలుగు రోజుల ముందు నిర్వహించి వీలైనంతగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అది. చాలా కాలంగా ఆ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే కంటెంట్ ఉన్న సినిమాకి ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా అవసరం లేదని 'లియో'..'సలార్' లాంటి సినిమాలు రుజువు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల రిలీజ్ లు ముందు ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు.
నేరుగా రిలీజ్ తేది ప్రకటించింది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అవి భారీ ఓపెనింగ్స్ తో పాటు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించాయి. అంటే ఇక్కడ తమ సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టాం అన్నది హైలైట్ అవుతుంది. అదే పద్దతిని మిగతా హీరోలు కూడా అనుసరించాలి అనుకుంటే? గనుక హీరోలెక్కడా తగ్గే పరిస్థితి ఉండదు. దాదాపు అంతా పాన్ ఇండియా స్టార్లు...కోట్లలో వసూళ్లు సాధించే స్టామినా ఉన్న హీరోలే కాబట్టి ప్రీరిలీజ్ ఈవెంట్ అనే దాన్ని కంటికి విపుగా కనిపించినా...అలా భావించినా ప్రీ రిలీజ్ కి కాలం చెల్లినట్లే.
అలా జరిగితే గనుక మరో పెద్ద ప్రమాదం కూడా ఉంది. సినిమా అభిమానులకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. హీరోల క్రేజ్ పై అది ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్లు నిర్వహించకుండానే సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అక్కడ హీరోలెవరు అభిమానుల్లో తిరగరు. పెద్దగా ప్రచారం చేయరు. షూటింగ్ పూర్తి చేస్తారు. రిలీజ్ కి ముందు ఓ ప్రెస్ మీట్ పెడతారు. రిలీజ్ చేస్తారు.
ఆ రకంగా బాలీవుడ్ హీరోలు-అభిమానుల మధ్య ఆ రకమైన అంతరమైతే కనిపిస్తుంది. కాబట్టి టాలీవుడ్ హీరోలు ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉండదు. తెలుగు హీరోలెప్పుడు అభిమానుల మధ్య తిరగాలి. ఆ క్రేజ్ అలాగే కొనసాగాలి. అప్పుడే హీరో-అభిమాని మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది.