ఐటీ నోటీసుల వేళ‌ త‌గ్గేదేలే అంటోన్న హీరో మామ్!

మ‌ల‌యాళ న‌టుడు కం డైరెక్ట‌ర్ పృధ్వీరాజ్ సుకుమారన్ కు ఇటీవ‌ల ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి నోటీసులు జారి అయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-07 05:42 GMT
ఐటీ నోటీసుల వేళ‌ త‌గ్గేదేలే అంటోన్న హీరో మామ్!

మ‌ల‌యాళ న‌టుడు కం డైరెక్ట‌ర్ పృధ్వీరాజ్ సుకుమారన్ కు ఇటీవ‌ల ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి నోటీసులు జారి అయిన సంగ‌తి తెలిసిందే. 2022లో రిలీజ్ చిత్రాలైన 'జ‌న‌గ‌ణ‌మ‌న‌', 'క‌డువ‌', 'గోల్డ్' చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి. పృధ్వీరాజ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం 'ఎల్ 2' రిలీజ్ అవ్వ‌డం..అది వివాదాస్ప‌ద‌మైన స‌మ‌యంలోనే ఐటీశాఖ నోట‌సులు జారీ చేయ‌డం అంతే ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈనెల 29వ లోపు పృధ్వీరాజ్ వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ డెడ్ లైన్ కూడా విధించింది. తాజాగా ఈ నోటీసుల‌కు ధీటుగా త‌గ్గేదేలే అంటూ హీరో త‌ల్లి మ‌ల్లికా సుకుమార‌న్ స్పందించారు. `విచార‌ణ‌కు భ‌య‌పడం. చెప్పిన‌ట్లుగానే విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాం. ఎక్క‌డా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌లేదు. డేటా అంతా క్లియ‌ర్ గా ఉంది. ఎలాంటి టెన్ష‌న్ అవ‌స‌రం లేద‌న‌ట్లు వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఇప్ప‌టికే ఐటీ నోటీసుల‌న్న‌ది పోలిటిక‌ల్ గేమ్ లో భాగంగా వ‌దిలారంటూ కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. 2022 సినిమాల‌కు సంబంధించి నోటీసులు ఇప్పుడు ఇవ్వ‌డం వెనుక ఆంత‌ర్య ఏంటి? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. `ఎల్ 2` సినిమాలో గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు సంబంధించిన స‌న్నివేశాలు చూపించ‌డంతో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. బీజేపీ...ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌లు తీవ్ర స్థాయిలో ఎటాకింగ్ దిగారు.

దీనిలో భాగంగా కొన్ని క‌ట్స్ కూడా విధించారు. దాదాపు 24 క‌ట్స్ ప‌డ్డాయి. అయినా స‌రే `ఎల్ 2` బాక్సాఫీస్ వేగాన్ని మాత్రం త‌గ్గించ‌లే క‌పోయారు. ఇప్ప‌టికే సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో మాత్రం పెద్ద‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు.

Tags:    

Similar News