ఇతడికి ఎలా సాధ్యం అవుతోంది..?
ఒకప్పుడు నటీ నటులు ఏడాదిలో పది సినిమాలు చేసే వారు, కొందరు దర్శకులు ఏడాదిలో మూడు నాలుగు సినిమాలను తీసుకు వచ్చే వారు అనే వార్తలు వింటూ ఉంటాం.;

ఒకప్పుడు నటీ నటులు ఏడాదిలో పది సినిమాలు చేసే వారు, కొందరు దర్శకులు ఏడాదిలో మూడు నాలుగు సినిమాలను తీసుకు వచ్చే వారు అనే వార్తలు వింటూ ఉంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా వరుసగా సినిమాలు చేయడం సాధ్యం కాదని, ఏడాదిలో రెండు లేదా మూడు సినిమాలు చేయడం దర్శకులకు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక నటీ నటులు ముఖ్యంగా ప్రముఖ హీరోలు సినిమాల విషయంలో చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోలు రెండేళ్లకి ఒకటి చొప్పున సినిమాలు చేస్తూ ఉంటే, దర్శకులు రెండు మూడు ఏళ్లకు ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో ఎక్కువ శాతం దర్శకులు అలాగే ఉన్నారు.
అతి కొద్ది మంది మాత్రం ఏడాదిలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ, క్రమం తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు అనడంలో సందేహం లేదు. ఇటీవలే ఈయన దర్శకత్వంలో రూపొందిన 'ఎల్ 2 : ఎంపురాన్' సినిమా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు పృథ్వీరాజ్ సుకుమారన్ నటుడిగా చాలా బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో నటించాడు. ఆ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈమధ్య కాలంలో పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.
ఒకానొక సమయంలో ఏడాదికి దాదాపు 20 సినిమాల్లో నటించిన రికార్డ్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కి దక్కింది. అలాగే ఈతరం నటుల్లో ఏడాదిలో పదికి పైగా సినిమాలను విడుదల చేసిన ఘనత పృథ్వీరాజ్ సుకుమారన్‌కి దక్కుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటారు. అయినా ఆయన సినిమాల సంఖ్య మాత్రం భారీగా ఉంటుంది. మొన్నటి వరకు రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా 'దార్య' చిత్రం షూటింగ్‌కి జాయిన్ అయ్యాడు. హిందీలో రూపొందుతున్న ఈ సినిమా లో కరీనా కపూర్ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
తల్వార్, రాజీ ల తర్వాతి చిత్రం జంగిల్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న 'దార్య' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దార్య సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఎల్ 2 సినిమా వివాదాస్పదం కావడంతో, పృథ్వీరాజ్ సుకుమారన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హిందూ వ్యతిరేకి అనే విమర్శలను పృథ్వీరాజ్ సుకుమారన్ ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఎన్ని విమర్శలు వచ్చినా సినిమాలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నాడు. ఒకే సమయంలో ఇన్ని సినిమాలు ఎలా సాధ్యం అంటూ చాలా మంది పృథ్వీరాజ్‌ను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు. దానికి పృథ్వీరాజ్ ఏమని సమాధానం చెబుతాడో చూడాలి.