సలార్ కోసం చాల రిస్క్ చేసాడు !
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల 'సలార్' చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల 'సలార్' చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలున్న ఈ సినిమా గురించి ప్రతి ఒక్క విషయం సినిమా యొక్క స్థాయిని పెంచుతూనే ఉంది. చిన్న విషయం అయినా కూడా జాతీయ స్థాయిలో చర్చకు తెర లేపుతోంది.
సలార్ ను సౌత్ ఇండియన్ భాషల్లోనే కాకుండా హిందీలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ పాత్రకు గాను హిందీ మరియు ఇతర భాషల్లో వేరు వేరు నటులు, డబ్బింగ్ ఆర్టిస్టులతో వాయిస్ చెప్పించారు. అయితే సలార్ లో నటించిన ఒక నటుడు మాత్రం అయిదు భాషల్లో కూడా తాను పోషించిన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడట.
ఆ నటుడు మరెవ్వరో కాదు మల్టీ ట్యాలెండ్ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ నటుడు సలార్ లో వరద అనే పాత్రలో కనిపించబోతున్నాడు అని ట్రైలర్ విడుదల తర్వాత క్లారిటీ వచ్చింది. చాలా విభిన్నమైన గెటప్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ను సినిమా లో చూడబోతున్నాము.
ప్రభాస్ తర్వాత అత్యంత కీలకమైన పాత్ర ను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడని సమాచారం అందుతోంది. అంతటి ముఖ్యమైన పాత్రలో తాను నటించి, మరో వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడం ద్వారా అంత ఎఫెక్ట్ గా ఉండదని భావించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కాస్త ఇబ్బంది అయినా, కష్టం అయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్తానని చెప్పాడట.
మలయాళంకు చెందిన చాలా మంది స్టార్స్, సూపర్ స్టార్స్ ఇతర భాషల్లో వారి సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో దుల్కర్ సల్మాన్ తన అన్ని పాన్ ఇండియా సినిమాలకు ఇతర భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా అన్ని భాషలకు డబ్బింగ్ చెప్పడం ను అంతా కూడా భేష్ అంటున్నారు.