'సలార్'.. అతనికి హెల్ప్ అయ్యిందా లేదా?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక సలార్ హిందీ వెర్షన్ నార్త్ లో దుమ్ము లేపుతోంది. వీకెండ్ తర్వాత క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ తో నార్త్ లో సలార్ కలెక్షన్స్ లో 25 శాతానికి పైగా గ్రోత్ కనిపించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
సినిమాలో వరదరాజమన్నార్ పాత్రలో కనిపించాడు పృథ్వీరాజ్. అయితే తెలుగు ప్రేక్షకుల్లో సలార్ సినిమాకి ఉన్న ఆదరణ చూసిన తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ కి టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది. ఇది ఒక విధంగా పృథ్వీరాజ్ కి మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా ఉండే సినిమాలో ఆడియన్స్ ఇతర పాత్రలను పెద్దగా పట్టించుకోరు.
కానీ సలార్ లో మాత్రం అలా కాదు. సలార్ లో ప్రభాస్, పృధ్వీరాజ్ ఇద్దరి పాత్రలకి సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతో పృధ్వీరాజ్ సుకుమారన్ ని ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సలార్ సినిమా మరింత హెల్ప్ అయిందనే చెప్పాలి. పృధ్వీరాజ్ మలయాళం లో స్టార్ హీరో. కానీ తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు.
సలార్ కంటే ముందు పృధ్విరాజ్ సుకుమారన్ అంటే ఆయన మలయాళ సినిమాలను తెలుగు డబ్బింగ్ వర్షన్ ని ఓటీటీలో చూసిన ఓ వర్గం ఆడియన్స్ కి మాత్రమే తెలుసు. ఇప్పుడు సలార్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకి మంచి ఆదరణ దక్కుతోంది. సలార్ తో పృధ్విరాజ్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సాలిడ్ బేస్ దొరికింది. ఇక రాబోయే రోజుల్లో ఈయనకి తెలుగులోనూ వరుస ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
దానికి తోడు పృధ్విరాజ్ మలయాళ సినిమాలు ఇప్పటినుంచి తెలుగులోనూ విడుదల చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సలార్ విషయానికి వస్తే రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.295 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మూడో రోజు క్రిస్మస్ హాలిడే ఉండడంతో ఈ సినిమా మరింత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.