వింక్ బ్యూటీకి గుడ్‌ జరిగింది..!

మళ్లీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్‌ కుమార్‌ నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలోనూ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది.;

Update: 2025-04-13 17:30 GMT
వింక్ బ్యూటీకి గుడ్‌ జరిగింది..!

ప్రియా ప్రకాష్ వారియర్‌... ఒక్క సూపర్‌ హిట్ సినిమా లేకున్నా సోషల్ మీడియాలో ఏకంగా 76 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక చిన్న సినిమాలో కన్ను గీటి, ముద్దు గన్ను పేల్చడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఆల్‌ ఇండియా రేంజ్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్‌ మీడియా ద్వారా టాప్ స్టార్‌గా మారిన విషయం తెల్సిందే. ఆ సినిమా పెద్దగా అలరించకున్నా పాపులారిటీని మాత్రం తెచ్చి పెట్టింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో, ఆ సోషల్‌ మీడియా క్రేజ్‌తో తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఆ ఒక్క సోషల్ మీడియా పాపులారిటీతో ప్రియా ప్రకాష్ వారియర్ దాదాపు ఆరు.. ఏడు సంవత్సరాలుగా కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. కెరీర్‌లో హిట్‌ లేకపోవడంతో హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటిస్తుంది. ఆ మద్య ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలోనూ ఈమె నటించింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. మళ్లీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్‌ కుమార్‌ నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలోనూ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమా తమిళనాట భారీ వసూళ్లు రాబట్టింది. లాంగ్‌ రన్‌లో సినిమా అత్యధిక వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తమిళ బాక్సాఫీస్‌ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. సినిమాలో హీరోయిన్‌ పాత్రలో కాకుండా కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్‌ నటించింది. ఎక్కువ స్క్రీన్‌ టైమ్‌ దక్కించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తనకు అప్పగించిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినా కచ్చితంగా న్యాయం చేస్తాను అన్నట్లుగా ప్రియాం ప్రకాష్ వారియర్‌ ఈ సినిమాతో ఇండస్ట్రీ వర్గాల వారికి, ముఖ్యంగా సౌత్‌ ఇండియన్ ఫిల్మ్‌ మేకర్స్ కి చెప్పకనే చెప్పింది.

అజిత్ సినిమాలో చిన్న పాత్రలో నటించినా పాపులారిటీ పుష్కలంగా లభిస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అందుకే ప్రియా ప్రకాష్ వారియర్‌ ఈ సినిమాలో నటించే అవకాశం దక్కినప్పటి నుంచి ఆశలు పెంచుకుంటూ వచ్చిందట. అనుకున్నట్లుగానే సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కడంతో పాటు, తన పాత్రకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది. రివ్యూల్లోనూ ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర గురించి ఆమె నటన గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. అందుకే ముందు ముందు ఈ అమ్మడు కోలీవుడ్‌తో పాటు ఇతర సౌత్‌ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 8 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ప్రియా ప్రకాష్ వారియర్‌కి మంచి రోజులు ఇప్పుడు వచ్చాయేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News