రానాతో మొదలైన ప్రియదర్శి "ప్రేమంటే"

తాజాగా ప్రారంభమైన మరో సినిమా పేరు "ప్రేమంటే". ఆసక్తికరమైన టైటిల్‌తో పాటు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ విడుదలైంది.

Update: 2025-01-19 06:57 GMT

విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రియదర్శి, కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నాడు. మల్లేశం, బలగం లాంటి సినిమాలు అతని స్థాయిని మరింత పెంచాయి. హీరోగా మారిన తరువాత సపోర్టింగ్ రోల్స్ చేయడం మానలేదు. ఇక హీరోగా డిఫరెంట్ ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా నో చెప్పడం లేదు. రెండు పడవల ప్రయాణంలో దర్శి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.


ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ప్రారంభమైన మరో సినిమా పేరు "ప్రేమంటే". ఆసక్తికరమైన టైటిల్‌తో పాటు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ విడుదలైంది, ఇది సరికొత్త అనుభూతిని పంచాలని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది.

ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా సందీప్ రెడ్డి వంగ, రానా దగ్గుబాటి హాజరయ్యారు. మొదటి సన్నివేశానికి రానా క్లాప్ ఇవ్వగా, సందీప్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ విధంగా సినిమా నిర్మాణానికి ఘనమైన ప్రారంభం దక్కింది. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన క్యూట్ హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రలో నటించనుండగా, తెలుగు టెలివిజన్ క్వీన్ యాంకర్ సుమ కనకాల కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

మేకర్స్ ఈ సినిమాను ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్‌గా చెబుతూ, "త్రిల్-ఉ ప్రాప్తిరస్తు" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జతచేశారు. నవనీత్ శ్రీరామ్ రచయితగా దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఆయన కథనశైలిలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ పుస్కూర్ , జాన్వి నారంగ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

వరుసగా డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ప్రియదర్శి ఈసారి కొత్తగా ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్, ప్రేక్షకుల కోసం కొత్త తరహా అనుభవాన్ని అందించనున్నదని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రత్యేక అతిథుల ప్రోత్సాహం కూడా ఈ చిత్రానికి మరింత బూస్ట్ ఇచ్చింది. "ప్రేమంటే" అనేది ప్రేక్షకుల హృదయాలను తాకే ప్రయత్నం మాత్రమే కాదు, అనేక క్షణాలను గుర్తు చేసేలా ఉంటుందని, హీరో హీరో కలగలసిన ప్రయాణం బ్యూటీఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News