ఆయనతో సినిమా కోసం చేయి కోసుకుంటా: ప్రియమణి
షారుఖ్ ఖాన్ చేసిన జవాన్ సినిమాలో నటించిన ప్రియమణి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక అసలు విషయానికొస్తే ప్రియమణి లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి నటన గురించి, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలో అయినా సరే ప్రియమణి తెలుగు, తమిళ భాషలతో పాటూ రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లైన కొత్తలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రియమణి, తను నటించిన పరుత్తి వీరన్ సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
పెళ్లయ్యాక నటనా జీవితానికి కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రియమణి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో బిజీబిజీగా గడుపుతోంది. షారుఖ్ ఖాన్ చేసిన జవాన్ సినిమాలో నటించిన ప్రియమణి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక అసలు విషయానికొస్తే ప్రియమణి లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
తనకు డైరెక్టర్ మణిరత్నం అంటే ఎంతో ఇష్టమని, ఆయన సినిమాలో నటించే అవకాశమొస్తే అన్నీ వదిలేసి ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తానని, అంతేకాదు దాని కోసం చేయి కోసుకోవడానికైనా సిద్ధపడతా అని తెలిపింది ప్రియమణి. ఆయన చేసిన సినిమాలు, ఆయనకున్న అనుభవం చూస్తే ఎలాగైనా సరే, ఎలాంటి పాత్రలో అయినా సరే ఆయన సినిమాలో నటించాలనే ఆశ పుడుతుందని ప్రియమణి చెప్తోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రావన్ సినిమాలో ప్రియమణి నటించిన విషయం తెలిసిందే.
సౌత్ లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం పేరు ముందు వరుసలో ఉంటుంది. సౌత్ సినిమా స్థాయిని మార్చిన అతి కొద్ది మంది డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, అంజలి, నాయకుడు, రోజా, సఖి, బొంబాయి సినిమాలు ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ గా చెప్పుకోవచ్చు. అలాంటి ఆయనతో పని చేయాలని ప్రియమణి ఏంటి ఎవరైనా అనుకుంటారు.
ఇక ప్రియమణి కెరీర్ విషయానికొస్తే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ప్రియ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్3 వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ రెండు సిరీస్‌లను పూర్తి చేసుకుని గ్రాండ్ సక్సెస్ అందుకుంది. త్వరలోనే మూడో సీజన్ ను కూడా ప్రైమ్ వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్3 లో హీరో మనోజ్ బాజ్‌పాయ్ భార్యగా ప్రియమణి నటిస్తోంది.