హేమ క‌మిటీ అన్నిప‌రిశ్ర‌మ‌ల్లో రావాలంటోన్న హీరోయిన్!

జ‌స్టిస్ హేమ క‌మిటీలు లాంటివి అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రావాలంటూ మెజార్టీ వ‌ర్గం న‌టీమ‌ణులు డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-29 06:17 GMT

జ‌స్టిస్ హేమ క‌మిటీలు లాంటివి అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రావాలంటూ మెజార్టీ వ‌ర్గం న‌టీమ‌ణులు డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌..ఖుష్బూ..సుహాసిని లాంటి నటీమ‌ణులు సైతం వాళ్ల డిమాండ్ కు త‌మ గొంతు క‌లిపారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపుల‌కు పుల్ స్టాప్ ప‌డ‌ల‌న్నా? అమ్మాయి భ‌ద్ర‌తంగా ప‌ని ప్ర‌దేశంలో ప‌నిచేయాల‌న్నా? ప్ర‌భుత్వాలు...ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఈ అంశాన్నిసీరియ‌స్ గా తీసుకుని ప‌నిచేస్తే త‌ప్ప‌! ఇలాంటి వేధింపులు త‌ప్ప‌వు అంటూ కోరుతున్నారు.

తాజాగా న‌టి ప్రియ‌మ‌ణి కూడా త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. `తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యా ళం ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తోన్న న‌టీమ‌ణులు ఎప్ప‌టి నుంచో ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. హేమ క‌మిటీ లాంటింది అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రావాలి. ప‌ని ప్ర‌దేశంలో సురక్షిత వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాలి. అప్పుడే ఇలాంటి వేధింపులు ఉండ‌క‌పోవ‌చ్చు` అని అన్నారు.

అలాగే గ్రామాల నుంచి సినిమా అంటే ఎన్నో ఆశ‌ల‌తో వ‌స్తోన్న అమ్మాయిల్ని ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు టార్గెట్ చేసి వేధిస్తున్నారని కోంత మంది మ‌ల‌యాళ న‌టీమ‌ణులు ఆరోపించారు. గ్రామాల నుంచి వ‌చ్చే వారికి ఏమీ తెలియ‌దు అనే అపోహ‌లో ఉండి దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా ఉన్న అన్నిచిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

కొలీవుడ్ లొ కొంద‌రు క‌మిటీ అవ‌స‌రం ఉంది? అంటే మ‌రికొంత మంది అలాంటి క‌మిటీలు మ‌న‌కి అవ‌స‌రం లేద‌ని వారించిన వారు ఉన్నారు. అయితే ఇలాంటి దాడుల్ని మాత్రం న‌డిగ‌ర్ సంఘం ఉపేక్షించ బోద‌ని సంఘం నుంచి హెచ్చ‌రిక జారీ అయింది. నాజ‌ర్, విశాల్, సూర్య లాంటి న‌టులు అల్టిమేటం ఇచ్చారు. అలాగే టాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఈ అంశాన్ని సీరియ‌స్ గా తీసుకుని ముందుకెళ్తుంది.

Tags:    

Similar News