పుట్టబోయే పిల్లల గురించి కూడా ట్రోల్ చేస్తున్నారు ప్రియమణి
పెళ్లి తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్తున్న ప్రియమణి, తాను మతాంతర వివాహం చేసుకోవడం వల్లే తనకు ఈ సమస్యలు వచ్చినట్టు చెప్తోంది.
ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లవుతున్నా ప్రియమణికి ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సౌత్ తో పాటూ నార్త్ లో కూడా ప్రియమణికి మంచి గుర్తింపే ఉంది. పలు సినిమాలు, సిరీస్‌లు, టీవీ షోలతో బిజీగా ఉన్న ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.
పెళ్లి తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్తున్న ప్రియమణి, తాను మతాంతర వివాహం చేసుకోవడం వల్లే తనకు ఈ సమస్యలు వచ్చినట్టు చెప్తోంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కొంతమంది తనను విమర్శించడమే పనిగా పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారని తెలిపింది. కేవలం తనను మాత్రమే కాకుండా తన భర్తను, పుట్టబోయే పిల్లల్ని కూడా ఇందులోకి లాగుతున్నారని ప్రియమణి బాధ పడింది.
ప్రియమణి 2017లోనే ముస్తాఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది. 2016లో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే తనకు ఆన్ లైన్ లో విమర్శలు ఎదురయ్యాయని అంటుంది ప్రియమణి. తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని తన వాళ్లతో చెప్తే సంతోషిస్తారనుకుంటే వారు మాత్రం తనను లవ్ జిహాది అంటూ ఇబ్బంది పెడుతూ విమర్శిస్తున్నారని ప్రియమణి చెప్తోంది.
తనపై లేని పోని ట్రోల్స్ చేస్తున్న వాళ్లు, ఇంకా పుట్టని పిల్లల్ని కూడా ఇందులోకి లాగి మరీ మాట్లాడుతున్నారని, ఆ విషయం తనను ఎంతగానో బాధపెడుతుందని ప్రియమణి తెలిపింది. తన భర్త గురించి అసలేం తెలియని వారు కూడా ఆయన గురించి ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడాన్ని ప్రియమణి తప్పుబట్టింది.
ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేయాలంటే ఆ ఫోటో కింద పెట్టే కామెంట్స్ వల్ల భయపడాల్సి వస్తుందని, అలాంటి కామెంట్స్ వల్ల తానెంతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రియమణి వెల్లడించింది. ఇప్పటికైనా నెటిజన్లు ఆమె బాధను అర్థం చేసుకుని ఈ విషయంలో సైలెంట్ అయితే బావుంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రియమణి మాత్రం తన కెరీర్ ను సాఫీగా మలచుకుని వరుస ఆఫర్లతో ఛాన్సులు అందుకుంటూ ముందుకెళ్తుంది.