ఆ హీరో కోసం అన్నీ వదిలేస్తానన్న హాట్ బ్యూటీ!
ప్రియమణి సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు టీవీషోలు చేస్తూనే మరోవైపు వచ్చిన ఏ సినిమా అవకాశం వదలడం లేదు.
ప్రియమణి సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు టీవీషోలు చేస్తూనే మరోవైపు వచ్చిన ఏ సినిమా అవకాశం వదలడం లేదు. చిన్న..పెద్ద అనే తేడా లేకుండా కమిట్ అవుతుంది. ఇండస్ట్రీలో ఖాళీగా ఉండటం కంటే వచ్చిన అవకాశాలతో బిజీగా ఉండటం ఉత్తమం అనే మార్గంలో ముందుకెళ్తుంది. అయితే తనకు అవకాశాలిచ్చిన హీరో విషయంలో తానెంత విశ్వాసం తో ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు.
ఎంతో మంది హిందీ హీరోలతో కలిసి పనిచేసింది. కానీ షారుక్ ఖాన్ మాత్రం అందరికంటే ఎక్కువగా అభిమానించే హీరోగా చెప్పుకొచ్చింది. ఆయన తన సినిమా కోసం పిలవాలేగానీ చేతిలో ఉన్న అన్నీ అవకాశాలు వదులుకుని వెళ్లిపోతానంది. ఈ క్షణం వచ్చేయాలని ఆయన నుంచి పిలుపు రావాలిగానీ ముంబై ప్లైట్ ఎక్కిపోతా. చేతిలో ఉన్న సినిమాలకంటే ఆయనతో కలిసి పనిచేయడమే ముఖ్యం` అని తెలిపింది. అమ్మడు తొలిసారి షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `చెన్నై ఎక్స్ ప్రెస్` లో 1234 గెట్ ఆన్ ద డాన్స్ ప్లోర్ పాటలో నటించింది.
ఆ సినిమాతో అమ్మడు నార్త్ లో బాగా పాపులర్ అయింది. అప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది గానీ అంత గుర్తింపు రాలేదు. షారుక్ ఇమేజ్ తో అక్కడ పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ అనంతరం అదే హీరో నటించిన `జవాన్` సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇందులో షారుక్ గ్యాంగ్ గాళ్ లీడర్ పాత్ర పోషించింది. షారుక్ తో నటించే అవకాశం రావడానికి కారణంగా బాద్ షానే. ప్రియమణి ప్రతిభను గుర్తించి షారుక్ పిలిచి ఆ రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.
రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. దీంతో షారుక్ సెంటిమెంట్ భామగానూ మారిపోయింది. అందుకే షారుక్ విధేయురాలిగా ఉండిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ లో మాటల సందర్భంలో షారుక్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకుంది. ప్రస్తుతం అమ్మడు `ది ఫ్యామిలీ మ్యాన్ -3` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ అవుతుంది.