మ‌హేష్ ఒక్క‌డితోనేనా ఇంకా ఎవ‌రైనా ఉన్నారా?

భార‌తీయులు ఆమె ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్తం చేయ‌డంతో వ‌చ్చే సాహ‌సం కూడా చేయ‌లేదు. ఆ మ‌ధ్య సోదురుడి పెళ్లి నిమిత్తం వ‌చ్చి వెళ్లింది.;

Update: 2025-03-19 16:00 GMT

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని పెళ్లాడిన త‌ర్వాత పూర్తిగా భార‌త్ కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందే హాలీవుడ్ సినిమాలో బిజీ అయినా? భ‌ర్త లేడు కాబ‌ట్టి అప్పుడ‌ప్ప‌డు ముంబైకి వచ్చేది. కానీ వివాహం త‌ర్వాత ముంబైని పూర్తిగా మ‌ర్చిపోయింది. భార‌తీయులు ఆమె ప‌ట్ల కొంత వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్తం చేయ‌డంతో వ‌చ్చే సాహ‌సం కూడా చేయ‌లేదు. ఆ మ‌ధ్య సోదురుడి పెళ్లి నిమిత్తం వ‌చ్చి వెళ్లింది.

ఈ తంతు పెళ్లికి ముందు...త‌ర్వాత రెండుసార్లు జ‌రిగింది. ఈ బ్యూటీ ప్రస్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ఓ సినిమా చేస్తోన్న నేప‌థ్యంలో ఇండియాలోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న షూటింగ్ లో భాగంగా నిన్న‌టి రోజునే ఒడిశా కోరాపూట్ లో షూటింగ్ ముగించుకుని వైజాగ్ కు చేరుకుంది. అక్క‌డ నుంచి ముంబై చేరుకుని అమెరికా వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలో పీసీ మ‌ళ్లీ భార‌త్ కు వ‌స్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

మ‌హేష్ సినిమాకి సంబంధించి త‌దుప‌రి ఫారిన్ షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. పీసీ పోర్ష‌న్ విదేశాల్లో కూడా ఉన్న‌ట్లైతే న్యూయార్క్ నుంచి రాజ‌మౌళి మార్క్ ప్లాన్ చేసిన లొకేష‌న్ కి చేరుకుంటుంది. ఈ సంద‌ర్భంగా పీసీ టాలీవుడ్ లో కొత్త సినిమాలు చేస్తుందా? లేక కేవ‌లం మ‌హేష్ వ‌ర‌కే ప‌రిమితం అవుతుందా? అన్న‌ది స‌స్పెన్స్. ప్ర‌స్తుతం టాలీవుడ్ సినిమా పాన్ ఇండియాని షేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని సినిమాలైతే పాన్ వ‌రల్డ్ కే రీచ్ అయ్యాయి. ప్ర‌తిష్టాత‌క్మ‌క ఆస్కార్ అవార్డు లు సైతం ద‌క్కించుకుంది ప‌రిశ్ర‌మ‌.

మ‌రి ఇలాంటి ప‌రిశ్ర‌మ‌లో పీసీ భ‌విష్య‌త్ లో మిగ‌తా స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌భాస్, ఎన్టీఆర్, బ‌న్నీ, రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్లు. `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గ్లోబ‌ల్ స్థాయిలో వెలిగారు. గ్లోబ‌ల్ బ్యూటీతో న‌టించ‌డానికి ఈ స్టార్లు కూడా సిద్ద‌మే. అయితే ఆ ఛాన్స్ తీసుకోవాల్సింది పీసీనే. హాలీవుడ్ లో ఆమె బిజీ స్టార్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ బిజీని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్ లో కొన‌సాగాలి.

Tags:    

Similar News