ప్రియాంక విషయంలో అది రూమరేనా?
వరుస హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా కన్ను ప్రస్తుతం సౌత్ సినిమాలపై పడింది.;

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రియాంకా చోప్రా సీనియర్ డైరెక్టర్ ప్రకాష్ ఝా రూపొందించిన `జై గంగాజల్` తరువాత హాలీవుడ్ బాట పట్టింది. `బేవాచ్` సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన పీసీ ఆ తరువాత వరుస ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. నిక్ జోనస్‌ని వివాహం చేసుకుని అక్కడే సెటిలై బాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. దాదాపు ఎనిమిదేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.
వరుస హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా కన్ను ప్రస్తుతం సౌత్ సినిమాలపై పడింది. కెరీర్ తొలినాళ్లలో దళపతి విజయ్ నటించిన `తమిళన్` సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ప్రియాంకా చోప్రా అదే ఏడాది తెలుగులో `అపురూపం` పేరుతో ఓ రొమాంటిక్ మూవీతో పరిచయం అయింది. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. అయితే దాదాపు 23 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత మరోసారి సౌత్ సినిమాలపై కన్నేసింది. ప్రస్తుతం రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్‌ల కలయికలో రూపొందుతున్న భారీ హాలీవుడ్ రేంజ్ మూవీలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత ప్రాజెక్టలకు పూర్తి భిన్నంగా జక్న్న ఈ ప్రాజెక్ట్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మూవీ అంగీకరించిన తరువాత ప్రియాంకా చోప్రా హైదరాబాద్‌లో పర్యటిస్తూ చిలుకూరు బాలాజీ టెంపుల్‌ని ప్రత్యేకంగా దర్శించుకోవడం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ భారీ ప్రాజెక్ట్ తరువాత ప్రియాంక మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని దక్కించుకుందని వార్తలు షికారు చేయడం మొదలైంది.
`పుష్ప 2`తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఈ మూవీ తరువాత రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి త్రివిక్రమ్‌తో చేయనుండగా, మరొక ప్రాజెక్ట్‌ని తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఈ నెల 8న రాబోతోంది. అత్యంత భారీ స్థాయిలో క్రేజీ ప్రాజెక్ట్‌గా అట్లీ తెరపైకి తీసుకురానున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించ నుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రియాంక ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని, అదంతా వట్టి ప్రచారం మాత్రమేనని తెలిసింది. ప్రస్తుతం జక్కన్న SSMB29 మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది.