పిక్‌టాక్‌ : కూతురుతో స్టార్‌ హీరోయిన్‌

అయితే అప్పుడప్పుడు మాత్రం తన కూతురు మల్టి మేరీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.;

Update: 2025-04-15 10:30 GMT
పిక్‌టాక్‌ : కూతురుతో స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్‌ నటిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాలో దాదాపుగా 92.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ప్రియాంక చోప్రా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే అప్పుడప్పుడు మాత్రం తన కూతురు మల్టి మేరీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అధికారికంగా మల్టి ఫేస్‌ను రివీల్‌ చేయని ప్రియాంక చోప్రా మరోసారి కూతురు ఫోటోలను షేర్ చేసింది, కానీ ఈసారి కూడా ఫేస్‌ను రివీల్‌ చేయలేదు. కూతురుతో క్వాలిటీ టైం స్పెండ్‌ చేస్తున్న ఫోటోలను షేర్‌ చేసింది.


ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకు చాలా క్వాలిటీ టైం ను కూతురు మాల్టి మేరితో గడిపినట్టుగా ఈ ఫోటోలను చూపిస్తూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్లిన సమయంలో మాల్టి చాలా ఆనందంగా, జాయ్ ఫుల్‌గా ఉంటుందని ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చెప్పకనే చెప్పింది. విభిన్నమైన ఔట్‌ ఫిట్స్ ధరించడంతో పాటు, రకరకాల ప్రాంతాల్లో ప్రియాంక తన కూతురు ఉన్న ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, తీసుకునే ఆహారం విషయాలను కూడా తన పోస్ట్‌ ద్వారా షేర్ చేసింది. ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకు మాల్టితో తీసుకున్న ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా తన కూతురు ఫోటోలను షేర్ చేసిన వెంటనే లక్షల మంది లైక్‌ చేయడంతో పాటు, ఎంతో మంది ఫోటోలు షేర్ చేసి, కామెంట్ చేస్తున్నారు. సినిమాలు, సిరీస్‌లు అంటూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను మాత్రం కూతురుకు ఎక్కువ సమయం కేటాయిస్తాను అంటూ ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా ప్రియాంక చోప్రా చెప్పకనే చెబుతోంది. అదే సమయంలో భర్త నిక్ సైతం పీసీ షేర్‌ చేసిన ఫోటోల్లో ఉన్నాడు. షూటింగ్ కోసం దేశ విదేశాల్లో చక్కర్లు కొట్టే ప్రియాంక చోప్రాకు ఇంత క్వాలిటీ టైం లభిస్తుందా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చాలా కాలం తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. అది కూడా ఒక తెలుగు సినిమా కావడం విశేషం. మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూటింగ్‌కి హాజరు అయింది. త్వరలో మరోసారి హైదరాబాద్‌లో జరగబోతున్న షెడ్యూల్‌ కోసం ప్రియాంక చోప్రా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా తెలుగు సినిమాలోనే కాకుండా త్వరలోనే ఒక హిందీ సినిమాలోనూ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంగ్లీష్‌లో ఒక వెబ్‌ సిరీస్‌ను ఈమె చేస్తోంది. అంతే కాకుండా హాలీవుడ్‌ మూవీస్‌లోనూ నటించేందుకు చర్చలు జరుగుతున్నాయట.

Tags:    

Similar News