లోదుస్తులు కనిపించాలని అడిగాడు.. దర్శకుడిపై పీసీ ఫిర్యాదు..
అయితే తాను ఎదిగే క్రమంలో 19 ఏళ్ల వయసులో ఒక దర్శకుడి నుంచి ఎదుర్కొన్న ఒక కఠిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంది.
గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేష్ సినిమా కోసం హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైందని కథనాలొచ్చాయి. తెలంగాణలోని పలు దేవాలయాలను సందర్శించిన పీసీ ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
పీసీ రెండు దశాబ్ధాల కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటి. మాజీ ప్రపంచ సుందరిగా, బాలీవుడ్ అగ్ర కథానాయికగా హోదాను అందుకుని, ఇప్పుడు హాలీవుడ్ లోను స్టార్ గా కొనసాగుతోంది. స్వయంకృషి, పట్టుదలతో ఈ స్థానాన్ని సాధించుకుంది. అయితే తాను ఎదిగే క్రమంలో 19 ఏళ్ల వయసులో ఒక దర్శకుడి నుంచి ఎదుర్కొన్న ఒక కఠిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంది.
ఆ దర్శకుడు ప్రియాంక చోప్రా ప్యాంటీ బయటకు కనిపించాలని కోరాడు. లోదుస్తులు కనిపించేలా కూచోవాలని పట్టుబట్టాడు. అలా చేస్తే ఆడియన్స్ చూస్తారని, ఆ సీన్ లో అలా చూపించాలని అడిగాడట. అయితే అతడి అసహ్యకరమైన ఆ డిమాండ్ గురించి తన తల్లి మధు చోప్రాకు పీసీ చెప్పుకుంది. 19 వయసులో తాను అలా చేయాలా? చేయలేనని, చివరకు సినిమా నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందట. ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, ఆ సమయంలో 19 ఏళ్ల ప్రియాంక తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వెల్లడించింది. స్టైలిష్ట్ కి ఫోన్ చేసి పొట్టి ప్యాంటీని రెడీ చేయాలని అడగాలని దర్శకుడు పీసీకి సూచించాడు. ముందు కూర్చున్న వారు ఆమె ప్యాంటీని చూడగలగాలనేది అతడి ఆలోచన. ఇదే విషయాన్ని పీసీకి నాలుగుసార్లు చెప్పాడు. అది కూడా దారుణమైన హిందీలో అతడు అలా చెప్పాడు.
ఆ వ్యాఖ్యతో షాక్‌కు గురై అసహ్యించుకున్న పీసీ ఆ రాత్రి తన తల్లి మధు చోప్రాకు చెప్పింది. నేను అతడి ముఖం కూడా చూడలేదు. ఇక్కడ ఎదగలేమని కూడా తల్లి మధు చోప్రాతో పీసీ నిరాశను వ్యక్తం చేసిందట. కెరీర్ మ్యాటర్ కి వస్తే ప్రియాంక చోప్రా మహేష్ తో సినిమా మాత్రమే కాకుండా, హాలీవుడ్‌లో సిటాడెల్ సీజన్ 2, హెడ్స్ ఆఫ్ స్టేట్ , ది బ్లఫ్ చిత్రాలను చేస్తోంది. ఫర్హాన్ అక్తర్ మల్టీస్టారర్ చిత్రం `జీలే జరా`లోను నటించాల్సి ఉంది.